Honey Trap: నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కేసు కలకలం రేపింది. నగర శివారుల్లోని బైపాస్ చౌరస్తాల్లో వాహనదారులను టార్గెట్ చేస్తూ ఓ భార్య భర్తలు వలపు వల వేసి మాటు వేస్తున్నారు. యువకులను టర్గెట్ చేస్తూ.. ఆతర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు.
నిజామాబాద్ లోని బైపాస్ రోడ్డు వద్ద ఆ మార్గం గుండా వెల్లే యువకులను టార్గెట్ చేస్తున్నారు. పక్కా సమాచారంతో భారీ ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన భార్యాభర్తలు ఇద్దరు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి వాహనదారులను మరియు యువకులను వలలో వేసుకొని వారిని నిలువునా దోచుకుంటున్నారు. అయితే నిందితురాలు యువకులతో చలా చనువుగా ప్రవర్తించి వారిని పక్కకు తీసుకెల్లి అటు పక్కే భర్త మాటు వేసి ఉండి ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. దీంతో ఆ వెంటనే భర్త ఎంట్రీ ఇచ్చి, తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించావంటూ బాధితులను బెదిరించడం మొదలుపెట్టేవాడు.
అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వాహనదారులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులకు కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం అందింది. దీంతో హనీ ట్రాప్ పై కన్నేసిన పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి నిజామాబాద్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అనంతరం దంపతుల వద్ద మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీలో హానీ ట్రాప్ వీడియోలు రికార్డ్ చేసి వారిని అరెస్టు చేశారు.
నిజామాబాద్ లో హనీ ట్రాప్ కలకలం
బైపాస్ చౌరస్తాలో వాహనదారులను టార్గెట్ చేస్తూ వలపు వల
ఆతర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న నాందేడ్‌కు చెందిన భార్య, భర్తలు
పథకం ప్రకారం యువకులపై వల
నిఘా పెట్టి దంపతులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
దంపతుల వద్ద మారణాయుధాలు… pic.twitter.com/9oGiNSV0GU
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2026
Also Read: ఐదురాష్ట్రాల ఎన్నికలపై.. సీపీఐ నారాయణ సంచనల వ్యాఖ్యలు