Airtel Recharge: టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తూ ముందుకు సాగుతున్న ఎయిర్‌టెల్.. తన యూజర్ల అవసరాలకు తగినట్లుగా మరో క్రేజీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ డేటా, ఫ్రీ ఓటీటీలు, లాంగ్ వ్యాలిడిటీ, అడిషనల్ బెనిఫిట్స్ కోరుకునేవారికి ఆల్ రౌండర్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. రూ.1199 ధరలో వచ్చిన ఈ ప్లాన్.. ప్రస్తుతం ఎయిర్ టెల్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీ రోజూ 2.5 GB డేటా లభించనుంది. ఒకవేళ 5G మెుబైల్ అయ్యుండి, ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ పరిధిలో ఉంటే అపరిమితంగా 5G డేటాను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రీ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ కింద యూజర్లు చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ లో ప్రధాన ఆకర్షణగా ఓటీటీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్స్ నిలుస్తున్నాయి. ఈ ఒక్క ప్లాన్ ద్వారా 18 కి పైగా ప్రముఖ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ (లైట్), సోనీ లైవ్, ఆహా, సన్ నెక్స్ట్, లయన్స్ గేట్ వంటి 18 పైగా ఓటీటీలను 84 రోజుల పాటు ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ద్వారా చూడవచ్చు. అంతేకాకుండా వందలాది లైవ్ టీవీ ఛానెళ్లు వీక్షించే వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పిస్తోంది.
Also Read: మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఈ ప్లాన్ లో డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలతో పాటు మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. రూ.4000 విలువైన అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. అలాగే ప్రతీ నెలా కొత్త కాలర్ ట్యూన్ ను సెట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. స్పామ్ కాల్స్ నుంచి యూజర్లను అలర్ట్ చేసేందుకు ‘ది సేఫ్ నెట్ వర్క్’ సేవలను సైతం ఈ ప్లాన్ ద్వారా యూజర్లు పొందొచ్చు.
Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!