Salil Arora On Travis Head whistle celebration: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో (Chennai Super Kings) పాటు అభిమానులను సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ (SRH Travis Head) ట్రోలింగ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన తర్వాత.. విజిల్ వేస్తూ, అక్కడి అభిమానులను హేళన చేశారు. చెన్నై గడ్డపై హైదరాబాద్ గెలిచిందని విర్రవీగుతూ రెచ్చిపోయారు. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. దీనిపై మాజీ క్రికెటర్లు కూడా సీరియస్ అయ్యారు. మ్యాచ్ గెలిచిన తర్వాత.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను రెచ్చగొట్టడం దారుణం అంటూ హెడ్ చేసిన పనిని తప్పు పట్టారు. అయితే ఈ విజిల్ సెలబ్రేషన్స్ (whistle celebration ) గురించి తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్ సలీల్ అరోరా ( SRH Salil Arora) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ట్రావిస్ హెడ్ తప్పేం లేదని… చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. అందుకే మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్లను ర్యాగింగ్ చేసినట్లు గుర్తు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చివరలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య లీగ్ దశలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత… చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను దారుణంగా ర్యాగింగ్ చేస్తూ విజిల్స్ వేశారు SRH ప్లేయర్లు. మొదట ఇషాన్ కిషన్… విన్నింగ్ షాట్ ఆడి, మీ పని అయిపోయింది స్టేడియం ఖాళీ చేయండి అంటూ సైగలు చేశాడు. ఆ తర్వాత హెడ్… ఎల్లో కలర్ విజిల్ వేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను అవమానిస్తూ.. రచ్చ రచ్చ చేశాడు.
అయితే ఈ సంఘటనపై తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ యంగ్ కుర్రాడు సలీల్ అరోరా క్లారిటీ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు వాళ్ళ అభిమానులు రెచ్చిపోయారని ఫైర్ అయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ను కించపరిచేలా విజిల్స్ వేశారని ఆగ్రహించారు. బంతి పడ్డప్పుడల్లా… సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను అవమానించేలా నినాదాలు కూడా చేశారని మండిపడ్డారు. అడుగడుగునా అవమానాలు ఎదురైన నేపథ్యంలో… కసిగా ఆడి సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచిందని వివరించారు. అందుకే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కించపరుస్తూ విజిల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అంతేగాని హెడ్ ఎలాంటి తప్పిదం చేయలేదని వివరించారు.