E-Paper
Advertisement

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం
Advertisement

Pakistan :  పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ టీం ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి, అనేక పరాజయాలను ఎదుర్కొంటూ.. విమర్శలకు దారితీస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్లేయర్లలో మార్పు రావడం లేదు. ఇలాంటి క్రమంలో కొత్త హెడ్ కోచ్ ను రంగంలోకి దింపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కుమార సంగక్కర, హేడెన్ లాంటి వాళ్లను ఇప్పటికే సంప్రదించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కు ఆఫర్ ఇచ్చిందట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Advertisement

ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. అటాకింగ్ క్రికెట్ ఆడే వీరేంద్ర సెహ్వాగ్ ను (Virender Sehwag) హెడ్ కోచ్ గా నియామకం చేసుకుంటే… మంచి ఫలితాలు వస్తాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయానికి వచ్చిందట. ఇలాంటి క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ కు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5 సంవత్సరాలపాటు వీరేంద్ర సెహ్వాగ్ తో అగ్రిమెంట్ రాసుకునేందుకు కూడా సిద్ధమైందట. అయితే దీనిపై వీరేంద్ర సెహ్వాగ్… నో చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో తాను కోచ్ గా చేయలేనని కుండ బద్దలు కొట్టి చెప్పారట.

ఒక హిందువుగా తాను పాకిస్తాన్ కు సేవలు చేయలేనని.. రిజెక్ట్ చేశారట. అయితే, ఈ ఆఫర్ వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కీలక సూచనలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. కుమార సంగక్కర, హేడెన్ లాంటి విదేశీ కోచ్ లు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సెట్ కారని వెల్లడించారు. షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ లాంటి ఇద్దరు దిగ్గజాలు ఉండగా… వేరే వాళ్ల కోసం అస్సలు వెతికకూడదని సూచనలు చేశారట. బ్యాటింగ్ కోచ్ గా షాహిద్ అఫ్రిది, బౌలింగ్ కోచ్ గా షోయబ్ అక్తర్ ను నియామకం చేస్తే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తిరిగి ఉండబోదని కుండ బద్దలు కొట్టి చెప్పారట వీరేంద్ర సెహ్వాగ్.

Advertisement

దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. గడిచిన రెండేళ్లలో పాకిస్తాన్ కు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. టి20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో సూపర్ 8 కంటే ముందే పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. యూఎస్ఏ అలాగే ఐర్లాండ్ లాంటి జట్ల చేతిలో ఓటమిపాలైంది. మొన్న బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ తో పాటు టెస్టు సిరీస్ కూడా కోల్పోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కూడా డౌట్ అని అంటున్నారు. అందుకే ప్రక్షాళన దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేస్తోంది.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×