Parents Attack on Couple: వారిద్దరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇద్దరికీ కులాలు అడ్డు వచ్చాయి. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. చివరకు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఆ యువతి. చివరకు అమ్మాయి తరపు బంధువులు యువతిపై దాడి చేశారు. ఆపై అమ్మాయిని తీసుకెళ్లారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో వెలుగుచూసింది.
స్టోరీలోకి వెళ్లే..
ఏలూరు చెందిన మణికంఠ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పల్నాడు జిల్లా బలుసుపాడుకు చెందిన సంయుక్త చదువు తర్వాత హైదరాబాద్‌లో జాబ్ చేస్తోంది. వీరిద్దరు అనుకోని సందర్భంలో కలిశారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహానికి దారి తీసింది. చివరకు ప్రేమగా మారింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు ప్రేమికుల విషయంలో వారు అనుకున్నట్లుగానే జరిగింది.
వారిద్దరు ఇష్టపడ్డారు
సంయుక్త వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే పల్నాడు నుంచి ఎకాఏకీన హైదరాబాద్‌కు వచ్చారు. తమ కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. కులాలు వేరని, అలాగ చేస్తే తమను కులం నుంచి వెలేస్తారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మణికంఠ లేకుండా తాను ఉండలేనని చెప్పేసింది కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపో యారు. కూతురు ఫోన్ చేస్తే కట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో కూతురికి కమ్యూనికేషన్ కట్ అయ్యింది.
ALSO READ: రియల్టర్ దారుణ హత్య, కాళ్లు కట్టేసి ఆపై చంపిన భార్య
మార్చి ఒకటి పెళ్లి
చివరకు మార్చి ఒకటిన యువకుడు పెద్దల సమక్షంలో సంయుక్త పెళ్లి చేసుకుంది. పేరెంట్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా ద్వారకా తిరుమలలో సాంప్రదాయ బద్ధంగా మణికంఠను మ్యారేజ్ చేసుకుంది సంయుక్త. ఈ విషయం సంయుక్త పేరెంట్స్ తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగని కూతుర్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని పెదవేగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మణికంఠ-సంయుక్త దంపతులు. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కు రావాలని సంయుక్త తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.
ప్రేమికుడిపై దాడి
కౌన్సిలింగ్‌కు రాలేదు. ఏలూరులోని మణికంఠ ఇంటికి 50 మందితో సంయుక్త బంధువులు చేరుకున్నారు. కోపంతో రగిలిపోయిన సంయుక్త తల్లిదండ్రులు, బంధువులు.. తమ ప్రతాపం చూపించారు. మణికంఠపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన వారి తల్లిదండ్రులను సైతం గాయ పరిచారు సంయుక్త బంధువులు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా తరహాలో సీన్ క్రియేట్ అయిపోయింది. ఏలూరు నుండి సంయుక్తను తీసుకుని కారులో వెళ్లిపోయారు ఆమె బంధువులు.
మరి ముగింపు ఎలా?
ప్రాణాపాయంలో ఉన్న మణికంఠను వెంటనే పేరెంట్స్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. దాడి జరిగి రెండు రోజులు అయ్యింది. సంయుక్త ఆచూకీ తెలియలేదు. ఆసుపత్రిలో ఉన్నా, తన భార్య ఎక్కడంటూ తన తల్లిదండ్రులను ప్రశ్నించాడు మణికంట. సంయుక్తను తనకు అప్పచెప్పాలని వేడుకుంటున్నాడు. తన భార్యను వారు ఏమైనా చేసి ఉంటారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు మణికంఠ. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగేశారు. మరి మణికంఠ-సంయుక్త వ్యవహారం ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.