E-Paper
Advertisement

Peddapalli district: ఓటమికి కారణమంటూ కోర్టుకు ఈడ్చారు.. మనస్తాపంతో చెరువులో దూకి వృద్ధురాలు మృతి

Peddapalli district: ఓటమికి కారణమంటూ కోర్టుకు ఈడ్చారు.. మనస్తాపంతో చెరువులో దూకి వృద్ధురాలు మృతి
Advertisement

Peddapalli district: పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజకీయ కక్షలు సామాన్యుల ప్రాణాల మీదకు ఎలా వస్తాయనే దానికి అర్థం పడుతోంది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాననే కోపంతో ఒక అభ్యర్థి చేసిన పని.. చివరికి ఒక వృద్ధురాలి ఆత్మహత్యకు దారితీసింది.

కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మెునారి రాధమ్మ (61) ఇటీవల రంగాపూర్ గ్రామానికి తన నివాసాన్ని మర్చుకున్నారు. అయితే.. గొల్లపల్లిలో ఆమెకు ఓటు హక్కు ఉండటంతో.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె అక్కడ ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కలబోయిన నరేందర్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నవారే తన ఓటమికి కారణమని భావించిన  నరేందర్.. రాధమ్మతో పాటు మరో ఇద్దరిపై పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

కోర్డు నుండి నోటీసులు అందడంతో రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనికి తోడు.. నరేందర్ సోదరుడు విజేందర్ ‘నీ వల్లే మా అన్న ఓడిపోయాడు’ అంటూ ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం ప్రారంభించాడు. ‘మీ కుటుంబం అంతు చూస్తాం’.. అంటూ చేసిన హెచ్చరికలు, కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో భయపడిన రాధమ్మ.. ఆ వేధింపులు తాళలేక ఎస్సారెస్పీ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

రాధమ్మ మృతితో గొల్లపల్లిలో విషాద ఛయాలు అలముకున్నాయి. తన తల్లి మరణానికి నరేందర్, విజేందర్లే కారణమని రాధమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement

ALSO READ:మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి హెలికాప్టర్ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×