Pet Dogs Eat Owner Corpse| కుటుంబసభ్యులు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందించే ఆ మహిళ నుంచి కొన్ని రోజులుగా ఎటువంటి సమాధానం రాలేదు. ఆమెతో మాట్లాడేందుకు, బాగోగులు కనుక్కునేందుకు కుటుంబసభ్యుల చాలా రోజుల పాటు ప్రయత్నించారు. మనసు ఏదో కీడు శంకించడంతో వారు ఉండబట్టలేక ఏకంగా ఆమె ఇంటికి వెళ్లారు. తలుపులు బాదినా కూడా ఆమె నుంచి స్పందన లేదు. దీంతో, వారు వెంటనే పోలీసులకు సంప్రదించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి అంతా షాకైపోయారు. ఇంట్లో ఆ మహిళ శవం కనిపించింది. అది కూడా వికారమైన స్థితిలో ఉంది. ఆమె శవాన్ని జంతువులు పీక్కు తింటున్నాయి. రోమేనియాలోని బుఖారెస్టులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఆడ్రియానా నీగో తన కుర్చీలో అచేతనంగా పడి ఉంది. ఆమె శరీరంలో సగ భాగాన్ని పెంపుడు కుక్కలు తిన్నాయి. ఆమె చనిపోయి చాలా కాలమే అయి ఉంటుందని పోలీసులు చూడగానే గుర్తించారు. తిండిపెట్టే వారు లేకపోవడంతో కుక్కలు ఆకలి తట్టుకోలేక ఆడ్రియానా మృతదేహాన్ని తినడం ప్రారంభించి ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆడ్రియానాను అలా చూసి కుటుంబసభ్యులు షాకైపోయారు. ఆ పరిస్థితిలో తమ కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు, సోదరుడు జీర్ణించుకోలేకపోయారు. అయితే అడ్రియానా ఆత్మహత్య చేసుకున్నదా? లేక ఎవరైనా హత్య చేశారా? ఆమెది సహజ మరణమా? అనేది ప్రశ్నల స్పష్టత రాలేదు.
Also Read: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!
ఆమెపై దాడి జరిగినట్టు ఆనవాళ్లు ఏవీ కూడా లభించలేదు. అందుకే మహిళ మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆడ్రియానా పెంపుడు కుక్కలను జంతు సంరక్షణ శాలలో వదిలిపెట్టారు. మరోవైపు బాధిత కుటుంబం ఆడ్రియానా మరణ వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఓ దేవ కన్య నింగికెగసింది. మా సోదరి ఈ లోకాన్ని వీడింది’ అంటూ శోకతప్త హృదయంతో ఈ విషాదకర వార్తను శ్రేయోభిషాలకు ఆమె సోదరుడు తెలియజేశారు.
పెంపుడు జంతువులు యజమానుల మృతదేహాలను తింటాయా?
అయితే, పెంపుడు జంతువులు చనిపోయిన తమ యజమానుల మృతదేహాలను తినడంలో వింతేమీ లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయని చెబుతున్నారు. 2013లో యూకేలోని ఓ మహిళ తన ఇంట్లో మరణించగా ఆమె మృతదేహాన్ని పెంపుడు పిల్లులు తిన్నాయి. రోజులు గడుస్తున్నా ఆమె తన ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు పోలీసులను సంప్రదించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి చూడగా దారుణ దృశ్యం కనిపించింది. యజమాని మరణించడంతో తిండి పెట్టేవారు లేక కొన్ని జంతువులు ఆకలికి అలమటించి కన్నుమూశాయి. మరికొన్ని మాత్రం ఆమె మృతదేహాన్ని తిన్నాయి. ఆహార దొరకని సందర్భాల్లో కుక్కలు, పిల్లులు చనిపోయిన యజమాని మృతదేహాలను తింటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.