Tollywood Celebrities : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ముందు ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడుతుంది ఆ తర్వాత ప్రేమలో పడతారు ఆ తర్వాత ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి వరకు కొన్ని జంటలు వెళితే కొన్ని జంటలు మాత్రం మధ్యలోనే విడిపోయి ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు. అయితే గతంలో కొన్ని జంటలు నిశ్చితార్థం చేసుకొని మరి విడిపోయారు. ఇండస్ట్రీలోని చాలామంది ప్రేమించుకున్నారు. ప్రేమించిన వారిని తమ భాగస్వామి చేసుకోవాలని పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. ఇంతకీ ఆ జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…
రష్మిక మందన్న – రక్షిత్ శెట్టి..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి టాక్ ని అందుకోవడంతో పాటు బాలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇక రీసెంట్ గా పుష్ప2 తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈమె గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లికి సిద్ధమైంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక రక్షిత్ శెట్టి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు దగ్గరికి తీసుకెళ్లారు. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు గానీ మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉందిని అనౌన్స్ చేసి మరి పెళ్లి క్యాన్సిల్ అయింది అని చెప్పారు.
తరుణ్ – ఆర్తి అగర్వాల్..
టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు. ఈయన ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం అడపాదడప సినిమాలతో పలకరిస్తూ వస్తున్నాడు. తరుణ్ ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తలేదు. ఆయన పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలు పై తరుణ్ రెస్పాండ్ అవ్వలేదు. గతంలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను తరుణ్ ప్రేమించారన్న విషయం తెలిసిందే. ప్రేమ పక్షుల లాగా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలని వీరి ఆశ కలగానే మిగిలింది. ఏమైందో తెలియదు గానీ ఆర్తి అగర్వాల్ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వెయిట్ లాస్ కోసం ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు ఆర్తి అగర్వాల్..
అక్కినేని అఖిల్ – శ్రీయా భోపాల్..
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ గురించి అందరికీ తెలుసు ఈయన హిట్ సినిమాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు ఏవి అంతగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక అఖిల్ గతంలో ఓ అమ్మాయి తో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
వీళ్లే కాదు ఉదయ్ కిరణ్ సుస్మిత కూడా పెళ్లి కూడా చివరి నిమిషంలో ఆగిపోయింది.. ఇలా చాలామంది జంటలే ఉన్నారు. అయితే కొందరు వరుస సినిమాలతో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..