Vizag Crime: విశాఖలో ఫిజియోథెరపీ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ఓ వైపు ప్రేమించిన అబ్బాయి.. మరోవైపు తల్లిదండ్రులు. వీరిలో ఎవరన్నది తేల్చుకోలేకపోయింది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటేనని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డింది.
విశాఖలో దారుణం.. ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ సిటీ ఉడా కాలనీలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటోంది ఫిజియోథెరపీ విద్యార్థిని రజినీ ఫ్యామిలీ. పైడి సత్యం ఫ్యామిలీ సొంతూరు శ్రీకాకుళం జిల్లా. హెచ్‌పీసీఎల్‌లో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. సత్యం పెద్ద కూతురు రజిని మధురవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజియో థెరపీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. వరుసగా హాలీడేస్ రావడంతో సత్యం ఫ్యామిలీ శ్రీకాకుళం వెళ్లింది.
సత్యం భార్య, చిన్న కుమార్తె బుధవారం స్వగ్రామానికి వెళ్లారు. ఇంట్లో సత్యం, కొడుకు, పెద్ద కూతురు ఉన్నారు. కొడుకుని స్కూల్ పంపాడు ఆయన. ఎప్పటి మాదిరిగా సత్యం డ్యూటీకి వెళ్లిపోయాడు. ఈనెల 23 నుంచి పరీక్షలు ఉండడంతో ఇంటి వద్ద ఉండి పెద్ద కూతురు రజిత ప్రిపేర్ అవుతోంది.
ఓవైపు తల్లిదండ్రులు.. మరోవైపు ప్రియుడు
బుధవారం కుటుంబ సభ్యులు బయటకు శ్రీకాకుళం వెళ్లడంతో ఇంట్లోనే రజిని మాత్రమే ఉంది. డ్యూటీ నుంచి ఇంటికి ఫోన్ చేశాడు ఆమె తండ్రి సత్యం. కూతురు రజిని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎదురింట్లో వున్న ఓ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. వెళ్లి తలుపు కొట్టాడు.. తీయకపోవడంతో కిటికీ ఓపెన్ చేసి చూశాడు.
ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది రజిని. ఇదే విషయాన్ని సత్యంకు ఎదురింటి అబ్బాయి సమాచారం ఇచ్చాడు. వెంటనే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. కూతుర్ని ఆ విధంగా చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు. యువతి ఆత్మహత్య విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పడక గది మంచంపై సూసైడ్ నోట్ కనిపించింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మాన్యవర్ షోరూమ్‌లో ఎగిసిపడిన మంటలు
అందులో కొన్ని అంశాలు ప్రస్తావించింది కూతురు. మమ్మీ-డాడీ.. తాను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నానని రాసుకొచ్చింది. మిమ్మల్ని మోసం చేయడం కరెక్టు కాదని తనకు అనిపించిందని, ఆ అబ్బాయికి దూరంగా ఉండడంతో తనకు వల్ల కావడం లేదని పేర్కొంది.
బతకడం ఇష్టంలేక ఈ పని చేస్తున్నానని, ఏమీ అనుకోవద్దని రాసుకొచ్చింది. మీరు, చెల్లి, తమ్ముడు జాగ్రత్త అంటూ ఆ లేఖలో రాసుకొచ్చింది. ఓ వైపు ప్రేమికుడ్ని మరిచిపోలేక తల్లిదండ్రులను ఒప్పించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. యువతి తండ్రి సత్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.