E-Paper
Advertisement

Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మాన్యవర్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మాన్యవర్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident: హైదరాబాద్‌ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న మంగళ గౌరి షాపింగ్ మాల్‌ సముదాయంలోని మాన్యవర్ బట్టల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం పై అంతస్తులకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద సమయంలో షోరూం లోపల కస్టమర్లతో పాటు సిబ్బంది కూడా ఉండటంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. షోరూం లోపల కొంతమంది సిబ్బంది చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం కిటికీలను పగులగొట్టి పొగను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Also Read: యాప్ పేరుతో మోసం.. ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ అరెస్ట్.. ఏకంగా రూ.792 కోట్లు

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఘటనకు కారణం షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల రోడ్ నంబర్ 36లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తూ, జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదం వల్ల ఆస్తి నష్టం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×