Ganja Racket: గంజాయి అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా సరే ఒడిషా నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిపోతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా సరుకు పట్టుబడుతుందని గానీ, కీలక నిందితులు మాత్రం పరారవుతున్నారు. తాజాగా కాజీపేట్ మీదుగా సికింద్రాబాద్ వస్తున్న రైళ్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. దాదాపు 27 కిలోల గంజాయి పట్టుబడింది.
గంజాయి అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేశారు. ఇన్నాళ్లు రోడ్డు మార్గం ద్వారా గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేది. భారీ ఎత్తున గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. దీంతో ప్రధాన రహదారులపై నిఘాను కట్టు దిట్టం చేయడంతో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. దీంతో రైళ్ల ద్వారా గంజాయి ఎగుమతికి ప్లాన్ చేశారు. గంజాయి పంటకు ఒడిషా కేరాఫ్‌గా మారిందని పోలీసులు పలుమార్లు చెప్పారు. అక్కడి నుంచే తరలి వస్తుందని అంచనా వేశారు.
భువనేశ్వర్ నుంచి వస్తున్న రైలులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు ఎస్టీఎఫ్ టీములు భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్నరైలులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్టిఎఫ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు కలిసి కాజీపేటలో రైలు ఎక్కి సికింద్రాబాద్ వరకు సోదాలు నిర్వహించారు.
అనుమానం వచ్చిన ప్రతీ బ్యాగులను తనిఖీలు చేశారు. ఓ బ్యాగ్‌లో భారీ ఎత్తున గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 26.885 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో దాదాపు రూ.13.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.గంజాయి ఉన్న బ్యాగ్ ఎవరిదనే విషయం తెలియరాలేదు.
ALSO READ: ప్రేమజంటపై దాడి.. అసలేం జరిగింది?
పోలీసులను గమనించి నిందితుడు అక్కడ నుంచి పరారైనట్లు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని డైరెక్టర్ వివి కమలహాసన్‌రెడ్డి అభినందించారు. సీజ్ చేసిన గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
ఆరురోజుల కిందట..
ఆరు రోజుల కిందట హైదరాబాద్‌లో 41 కేజీల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ముగ్గురు అరెస్ట్ చేశారు కూడా. ఒడిషాలోని కోరాపుట్‌కు చెందిన ఓ వ్యక్తి అడ్డదారిలో గంజాయిని తీసుకొచ్చాడు. హైదరాబాద్ కు తీసుకొచ్చిన గంజాయిని కూకట్‌పల్లికి చెందిన బుర్రా శ్రీనివాసులు, గోనుగుంట అభిషేక్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాడు.
ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా వెంగళరావునగర్‌లోని నలంద స్కూల్ వద్ద గ్రౌండ్లో ఉన్న వీరిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 కేజీల గంజాయి, రూ.40 వేల నగదు, ప్యాకింగ్ మెటీరియర్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజుల కిందట ఆపరేషన్ ధూల్‌పేట్
మూడు రోజుల కిందట ఆపరేషన్ ధూల్‌పేట్ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. దీంతో ధూల్‌పేట్ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసి వాటిని అమ్మకుండా ఉక్కు పాదం మోపారు. ఎవరైనా గంజాయి ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.