Pune: భార్యభర్తల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా, అనుమానం అనేది ఉండకూడదు.. రాకూడదు. ఏమున్నా ఓపెన్ గా చెప్పుకుంటే సమస్యలు తొలిగిపోతాయి. లేకుంటే లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. టెక్ యుగంలో అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ఆ తరహా అనుమానం మరింత పెరిగింది. లేని సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి పూణెలో వెలుగుచూసింది.
పూణెలో దారుణమైన ఘటన.. అనుమానపు భర్త పిశాచి
పుణెకు చెందిన ఓ జంట కాపురం ఉంటున్నారు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు వుండగా మూడో సంతానం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొడుకు పుట్ట లేదన్న కోపం రోజు రోజుకూ భర్తకు అనుమానం మొదలైంది. అదే సమయంలో తెలిసినవారితో భార్య క్లోజ్‌గా ఉండడం తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత అనుమానం రెట్టింపు అయ్యింది.
ఇద్దరు కలిసి కూర్చొని సమస్యల గురించి చర్చించుకుంటే సరిపోయేది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెరిగి పోయింది. చివరకు ఓ రోజు మద్యం తాగి వచ్చి భార్యని గట్టిగా నిలదీశాడు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావో చెప్పు? అంటూ భార్యని కొట్టడం మొదలుపెట్టాడు.
భార్య ప్రైవేటు పార్ట్స్‌పై ఫినాయిల్ వేసి, ఆ తర్వాత
ఆ తర్వాత ప్రైవేటు పార్ట్స్‌పై ఫినాయిల్‌తో దాడి చేశాడు. తన్నడం వంటి వికృత చర్యలకు దిగాడు. దాదాపు రెండువారాల పాటు భర్త టార్చర్ అనుభవించింది. బాధితురాలు నొప్పితో కేకలు వేస్తూ పారిపోవాలని చూసింది. తలుపులు లాక్ చేసి మరీ దారుణంగా కొట్టాడు భర్త. కేకలు విన్న తోటి కోడలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.
చివరకు మే 9న భర్త పనికి వెళ్లిన తర్వాత తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి పారిపోయింది. అల్లుడు చేసిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల కిందట కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాల్ని చికిత్స కోసం పుణెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్త కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ALSO READ: కెమిస్ట్రీ చదివి.. కల్తీ దందాకు తెరలేపాడు.. ఎన్సీబీ చేతికి చిక్కిన ‘అల్ఫ్రాజోలెం’ ముఠా