Sangareddy News: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఉన్న బీసీ బాలికల హాస్టల్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్, హాస్టల్ వార్డెన్ శారద, ఇద్దరు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది లక్ష్మి, శాంతాబాయిలపై పోలీసులు పోక్సో చట్టం యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జులై 22, 2025న వెలుగులోకి వచ్చింది, దీనిపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్ కూమారుడు..
రాజేష్ చౌహాన్, హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, తరచూ హాస్టల్‌కు వచ్చి విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించేవారట.. విద్యార్థినుల ఫిర్యాదు ప్రకారం, రాజేష్ రోజూ మద్యం సేవించి హాస్టల్‌లోకి ప్రవేశించారు.. నిద్రిస్తున్న సమయంలో ఫోటోలు తీయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థునిలు వార్డెన్ శారదకు తెలియజేశారు. అయిన ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బదులుగా ఫిర్యాదు చేసిన విద్యార్థినులను వార్డెన్ దూషించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాజేశ్ అలా చేయడంలో శారద పాత్ర కూడా ఉందని చెబతున్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలుగురిపై పోక్సో కేసు నమోదు..
ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సోమవారం రాత్రి భారీ వర్షంలోనూ హాస్టల్ ప్రాంగణంలో నిరసన తెలిపి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు రాజేష్, శారద, లక్ష్మి, శాంతాబాయిలపై పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా వెల్ఫేర్ అధికారి జగదీశ్ నిర్వహించిన విచారణలో శారదను వెంటనే బదిలీ చేయడం, ఇద్దరు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల నుండి తొలగించడం జరిగింది.
Also Read: అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుకు నిప్పు.. ఎగసిపడ్డ మంటలు
విద్యార్థినుల భద్రతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు, త్వరలోనే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి, నిందితులను వెంటనే అరెస్టు చేసి, శారదను శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, విద్యార్థినుల భద్రతపై అధికారులు తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందుతులకు కఠినంగా శిక్షిస్తే మళ్లీ ఇలాంటి అరచకాలు జరగకుండా ఉంటాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు.