E-Paper
Advertisement

చికిత్సకు డబ్బు లేదని.. ఆస్పత్రిలో బాంబు పెట్టాడు.. వీడు మామూలోడు కాదు!

చికిత్సకు డబ్బు లేదని.. ఆస్పత్రిలో బాంబు పెట్టాడు.. వీడు మామూలోడు కాదు!
Advertisement

Fake Bomb: మహారాష్ట్ర పూణేలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు డబ్బు లేకపోవడంతో ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆస్పత్రిలో బాంబు పెట్టి.. వైద్యానికి అవసరమైన డబ్బును పొందాలని పథకం పన్నాడు. ఆ ప్లాన్ బెడిసి కొట్టడం కటకటాలపాలయ్యాడు. అయితే నిందితుడ్ని దర్యాప్తు అధికారులు విచారించగా.. మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

అసలేం జరిగిందంటే?

మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన శివాజీ రాథోడ్.. ఆరోగ్యం బాగోకపోవడంతో పూణేలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే చికిత్సకు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా శివాజీ ఖంగు తిన్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. దానిని సంపాదించేందుకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి కాల్ చేసిన శివాజీ.. ఆస్పత్రి ప్రాంగణంలో బాంబు అమర్చానని అది పేలకూడదంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రి వర్గాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా అది ‘నకిలీ బాంబు’ అని తేలింది. కేవలం భయపెట్టి డబ్బులు గుంజడానికే ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు.

ఎలా దొరికాడంటే?

Advertisement

నకిలీ బాంబును స్వాధీనం చేసుకున్న అనంతరం.. దర్యాప్తు అధికారులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. నకిలీ బాంబుకు చుట్టిన టేపు, దానికి సంబంధించిన ఆన్ లైన్ పేమేంట్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. నిందితుడు తొలుత నకిలీ బాంబును తీసుకొచ్చి.. ఆస్పత్రిలో అమర్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టేప్ సరిపోకపోవడంతో దగ్గరలోని షాపు వద్దకు వెళ్లి.. కొత్త టేప్ తీసుకున్నాడు. నకిలీ బాంబుకు రెండు రకాల టేపులు ఉండటాన్ని గమనించి పోలీసులు దర్యాప్తు చేయగా.. సమీపంలోని షాపులోనే నిందితుడు దానిని కొన్నట్లు తెలిసింది.

Also Read: పెట్రోల్ vs సీఎన్‌జీ కారు.. సామాన్యుడికి ఏది లాభం? సూటిగా సుత్తిలేకుండా తెలుసుకోండి!

బాంబు కోసం రూ.400 ఖర్చు

Advertisement

దీంతో శివాజీ రాథోడ్ ను పట్టుకునేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బంది, ఉన్నాతాధికారులతో కూడిన బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. చివరికి నాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఉగ్రవాద నిరోధక దళం (ATS) అతడ్ని అరెస్టు చేసింది. చికిత్సకు డబ్బు అవసరం కావడంతోనే ఈ బాంబు ప్లాన్ కు తెరలేపినట్లు నిందితుడు అంగీకరించాడు. నకిలీ బాంబ్ తయారీకి రూ.400 ఖర్చు అయినట్లు పేర్కొన్నాడు. అయితే పోలీసులు.. గాలింపు చర్యలకు రూ.4 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. నిందితుడు నేపాల్ లోని తన సోదరి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. నాగ్ పూర్ స్టేషన్ లో అతడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Also Read: పెట్రో బాంబు పేలింది.. కిరాణా కొట్టు నుంచి క్యాబ్ ప్రయాణం వరకు.. ధరలు పెరగనున్న లిస్ట్ ఇదే!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×