Pune Crime: మహారాష్ట్రలోని పుణే నగరంలో వెలుగు చూసిన దారుణ ఉదంతం యావత్ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కేవలం 19 ఏళ్ల వయసున్న అయాన్ అహ్మద్ తన్వీర్ అనే యువకుడు తన వికృత చేష్టలతో వందలాది మంది అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని, వారిని తన వలలో వేసుకున్నాడు. వారిలో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాదాపు 350కి పైగా ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వారిని వేధించనట్లు ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడి అరాచకాలకు బుద్ధి చెప్పేలా మహారాష్ట్ర పోలీసులు అత్యంత కఠినమైన చర్య తీసుకున్నారు. సాధారణంగా నిందితులను రహస్యంగా తరలిస్తుంటారు. కానీ, ఈ కేసులో ప్రజలకు ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో అతనికి సంకెళ్లు వేసి పరాట్యాడ నగర వీధుల్లో బహిరంగంగా ఊరేగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ఈ సాహసోపేతమైన చర్యకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా యువతులను వేధించే మృగాల పట్ల ఇలాంటి కఠిన వైఖరి అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.
Also Read: తిరుపతిలో తీవ్ర విషాదం.. ఒకే ఫ్యామిలీలో 5గురు మృతి.. అసలేం జరిగింది?
180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు
పూణే సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్(19)
సోషల్ మీడియా ద్వారా దాదాపు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి, వారిని లోబరుచుకుని 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు… https://t.co/kzRJMbot8K pic.twitter.com/XyoQcY2MLl
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026