Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానిక విజయలక్ష్మి హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల.. ఇద్దరు కవల శిశివులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్, కీర్తిలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో.. ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దంపతులు డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు.
20 రోల క్రితం ట్రీట్ మెంట్ కోసం కీర్తి ఇబ్రంహీంపట్నం ఆస్పత్రికి వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని, ఎలాంటి పనులు చేయకూడదు.. బెడ్ రెస్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించింది. అయితే ఐదు నెలల గర్భిణి అయిన కీర్తీకి.. సోమవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో హాస్పటిల్‌కి తీసుకొచ్చారు.
ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో.. డాక్టర్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు.. గర్భిణి కీర్తికి నర్సు ఇంజక్షన్లు ఇచ్చి చికిత్స చేసింది. ఉదయం పది గంటలు అయినా ఆస్పత్రికి డాక్టర్ రాలేదు. వీడియో కాల్ ద్వారానే కీర్తికి ట్రీట్మెంట్ అందించారు. చివరకు ఇద్దరు మృత శిశువులు బయటకు వచ్చారు. 11 గంటలకు డాక్టర్ అనూషా రెడ్డి.. కవలలు మృతి చెందారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. అనంతరం చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేశారు ఆసుపత్రి యాజమాన్యం.
మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారు.. పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ.. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు. ఇప్పటికే సంతానం కోసం రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని.. కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో.. ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: మర్మాంగాలను కొరికి తిని..పెంపుడు కుక్క దాడికి బలైన ఓనర్
వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని వాళ్లు మండిపడుతున్నారు. న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. డాక్టర్ అనూషరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు… ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని భావించి.. చర్యలు చేపట్టారు. ఆస్పత్రిని సీజ్ చేసి డాక్టర్ అనూషను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.