BigTV English

Varun – Lavanya: ఇట్స్ అఫిషియల్… తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్ -లావణ్య.. పోస్ట్ వైరల్..!

Varun – Lavanya: ఇట్స్ అఫిషియల్… తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్ -లావణ్య.. పోస్ట్ వైరల్..!

Varun – Lavanya:మెగా అభిమానులకు ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా శుభవార్త తెలియజేశారు. “ఇద్దరం కాస్త ముగ్గురు కాబోతున్నాం.. తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నాం” అంటూ తన భార్య లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) చేయి పట్టుకొని చిన్నపిల్లల షూ తో ఫోటో పంచుకున్నారు. మొత్తానికి అయితే లావణ్య, వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అనే విషయం తెలియడంతో మెగా అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. త్వరలోనే మెగా కుటుంబంలోకి ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ అడుగుపెట్టబోతున్నారు అని నెటిజన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


త్వరలో మెగా కుటుంబంలోకి వారసుడు..

ఇకపోతే రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) జంట తల్లిదండ్రులు కావడం కోసం అభిమానులు దాదాపు 11 ఏళ్లు ఎదురు చూసారు. ఇక వారి ఎదురుచూపుకు తెరదించుతూ ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాపకు మరికొన్ని రోజులు గడిస్తే రెండు సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. ప్రస్తుతం పాపే జీవితంగా బ్రతుకుతున్న ఈ కుటుంబంలోకి మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు త్వరలోనే రాబోతోంది. అసలే వారసుడు కావాలి అని తన కొడుకు రామ్ చరణ్ ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈవెంట్ సందర్భంగా కోరి.. విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరి మెగాస్టార్ కోరికను ఇప్పుడు వరుణ్ తేజ్ – లావణ్య దంపతులు నెరవేరుస్తారేమో చూడాలి అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కొడుకైనా.. కూతురైనా ఘనంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి మెగా ఫ్యామిలీ ఎదురుచూస్తోంది.


లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లి..

2017లో ‘మిస్టర్’ సినిమా ద్వారా తొలిసారి సెట్లో కలుసుకున్న ఈ జంట.. ఆ తర్వాత 2018లో అంతరిక్షం 9000 KMPH లో కూడా కలిసి పనిచేశారు. ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట దాదాపు 2023 వరకు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగానే ఉంచారు.ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వచ్చినా అటు లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని కొట్టివేసింది. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఎట్టకేలకు 2023 జూన్ 8న హైదరాబాదులో నాగబాబు (Naga Babu) ఇంట్లో అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచిన ఈ జంట, అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వివాహం జరిగిన ఏడాది తర్వాత లావణ్య ఇప్పుడు గర్భం దాల్చడంతో మెగా కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తోంది. అంతేకాదు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ:NTRNeel : మళ్లీ సముద్రంపై యుద్దం చేస్తున్న తారక్… ఇప్పుడు నీల్ మావా స్టైల్‌తో..!

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×