Thalapathy Vijay : ఏజ్ అయిపోయిన సినిమా వాళ్ళందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు, ప్రేమించుకుని విడిపోయిన ప్రేమికులంతా ఫ్రెండ్స్ అయిపోరు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో రాస్తారు. ఇదే మాటను నిజ జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులు నిజం చేస్తూ వచ్చారు. సినిమాల్లో కొంత కాలం పాటు నటించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని వాళ్ళ అభిమానులను ఓట్లేసే ప్రజలుగా మార్చుకున్నారు. చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ సపోర్ట్ కోరుకునేది కూడా అందుకే. ఒక నటుడిని చూసి థియేటర్ వచ్చి టికెట్ కొని వాళ్లను ప్రేక్షకులను ఓటర్లు మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రజలంతా అవివేకంతో కూడా లేరు అని చెప్పాలి. ఎందుకంటే పలు సందర్భాల్లో చాలామంది పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం జగనన్నకు ఓటేస్తాం అనే నినాదాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేశారు. దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా నా మీటింగ్లకు వస్తారు కానీ నాకు ఓట్లు వేయరు అని చాలా సందర్భాల్లో బహిరంగంగానే అన్నారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ
అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని స్థాపించి ప్రశ్నించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. వెంటనే పోటీ చేయకుండా 2019 వరకు ఆగి పోటీ చేసి కేవలం ఒక సీటు మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే వెంటనే పార్టీని వేరే పార్టీలో విలీనం చేయకుండా. తనకు తాను నిలబడి వ్యూహాలు రచించి నేడు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడు. 21 సీట్లు తన పార్టీలో సభ్యులతో గెలిపించారు. ఇక ప్రస్తుతం విజయ్ కెరియర్ పీక్ లో ఉంది అనే టైంలో తమిళనాడు రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఇక విజయ్ కూడా తన పొలిటికల్ స్పీచ్ లో చాలామంది సినిమా ఉన్నట్లుని కూడా గుర్తు చేసుకున్నాడు. విజయ్ సభకు మాత్రం బీభత్సంగా ప్రజల హాజరవుతున్నారు.
విజయ్ చివరి సినిమా
హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ జననాయగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విజయ్ కెరియర్ లో వస్తున్న చివరి సినిమా అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ పేరుకు నిజ జీవితంలో విజయ్ పార్టీ పేరుకు చాలా దగ్గర సంబంధం ఉంది. విజయ్ పార్టీ పేరు “తమిళ వెట్రి కలగం”. దీనిని షార్ట్ కట్ లో టీవీకే అంటారు. అలానే విజయ్ పేరు దీంట్లో “తలపతి వెట్రి కొండన్” దీనిని కూడా షార్ట్ కట్ లో టీవీకే అంటారు. మొత్తానికి ఇటు సినిమాకి అటు పొలిటికల్ పార్టీకి ప్లస్ అయ్యేటట్లు ఈ నేమ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు హెచ్ వినోద్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Karthik Subbaraj : అంత పెద్ద స్టార్స్ తో పనిచేసే మళ్లీ ఇండిపెండెంట్ ఫిలిం ఏంటన్న.?