Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనతో తప్పించుకునేందుకు యవతి తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు రైలు నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడింది బాధితురాలు. అల్వాల్ స్టేషన్ దాటిన తర్వాత ఈ వ్యవహారం వెలుగుచూసింది. అయితే బాధితురాలు గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు పోలీసులు.
అసలేం జరిగింది?
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన 23 అమ్మాయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తోంది. మేడ్చల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. అయితే సెల్‌ఫోన్ డ్యామేజ్ కావడంతో శనివారం ఎంఎంటిఎస్ రైల్లో సికింద్రాబాద్ వచ్చింది. ఫోన్ రిపేర్ తర్వాత తిరిగి మేడ్చల్ వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ మహిళల కోచ్‌లో యువతి ఎక్కింది.
ఎంఎంటీసీ రైలులో ఏం జరిగింది?
ఆ బోగీలో అప్పటికి ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిద్దరు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో యువతి మాత్రమే ఉంది. అదే సమయంలో ఆ బోగీలోకి ఓ యువకుడు దూసుకొచ్చాడు. యువతిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇద్దరు మధ్య చిన్నపాటి పెనుగులాట జరిగినట్టు తెలుస్తోంది. యువకుడ్ని నుంచి తప్పించుకోడానికి కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది.
చివరకు గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె ట్రాక్‌పై కనిపించింది. పట్టాలపై యువతిని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 లో యువతిని గాంధీ ఆసుపత్రి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తర్వాత యువతి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎందుకు ట్రాక్ పై ఉన్నావనే దానిపై ఆమె నుంచి పోలీసులు ఆరా తీశారు.
ALSO READ: ప్రేమించాడు.. ఆపై హత్య చేశాడు
తనపై 20 ఏళ్ల లోపు యువకుడు దాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. యువకుడి గురించి వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఇంతకీ ఆ యువకుడు ఎవడు అనేదానిపై ఆరా తీస్తున్నారు. స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైల్వే పోలీసుల వెర్షన్
ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచార కేసు విచారణ కొనసాగుతుందన్నారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి తలకు బలమైన గాయం అయ్యిందన్నారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్లు ఉంచాలని వైద్యులు సూచించారని తెలియజేశారు.
ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. మహిళా భోగిలో ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయాణించాడని, అల్వాల్ వరకు ముగ్గురు మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. అల్వాల్ స్టేషన్ దాటిన తర్వాత బాధితురాలు మాత్రమే అందులో ఉందని, దీన్ని గమనించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడన్నది అధికారుల వెర్షన్. తన కోరిక తీర్చాలంటూ ట్రైన్లో ఇబ్బందులు గురి చేశాడని, దీంతో భయాందోళనలు చెందిన బాధితురాలు నడుస్తున్న ట్రైన్ లోనుంచి కిందకు దూకిందన్నారు.