East Godavari Crime News: వారిద్దరు ప్రేమించుకున్నారు. అమ్మాయి వయస్సు 16 ఏళ్లు.. అబ్బాయి వయస్సు 20 ఏళ్లు. మరి ఏం జరిగిందో తెలీదు. అనుమానం పెనుభూతం అయ్యింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించారు బాలిక ప్రేమికుడు. కోపంతో రగిలిపోయాడు. తన పగ తీరాలంటే ఒక్కటే శరణ్యమని భావించాడు. మనసులోని వచ్చిన ఆలోచనను పక్కాగా ప్లాన్ చేశాడు. తల్లీ-కూతుళ్లను దారుణంగా చంపేశాడు. ఆపై పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసుల అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
మూడేళ్ల కిందట మహిళ భర్త చనిపోయాడు. చిన్నవయసులో ఫ్యామిలీ బాధ్యతలను భుజాన వేసుకుంది 16 ఏళ్ల బాలిక. బుల్లితెరపై చిన్న చిన్న కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి అండగా నిలిచింది. ఫ్యామిలీ నిలదొక్కుకుందన్న సమయంలో వారి జీవితాల్లో యముడిగా వచ్చాడు ఓ యవకుడు. అనుకోకుండా బాలికతో ఆ యువకుడి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ వ్యవహారం మా కుటుంబాన్ని చంపేస్తుందని ఊహించలేకపోయారు. చివరకు ప్రియుడి చేతితో బాలిక, ఆమె తల్లి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన రాజమండ్రిలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది?
పోలీసుల కథనం మేరకు.. ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహ్మద్ సల్మా, సానా అనే 16 ఏళ్ల కూతురు ఉంది. కొద్దిరోజులుగా రాజమండ్రిలోని హుకుంపేట ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్‌కు సల్మా రెండో భార్య. అనారోగ్యం కారణంగా ఆయన మూడేళ్ల కిందట మరణించాడు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు. వారంతా రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు.
నిందితుడు శ్రీకాకుళం వాసి
రెండో భార్య కూతురు మహ్మద్ సానియా అలియాస సనా చిన్న చిన్న ఈవెంట్లకు యాంకర్‌గా కనిపిస్తుంది. సల్మా-సనాకు తోడుగా వారి ఇంట్లో మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్ ఉంటున్నాడు. ఆరు నెలల కిందట పిఠాపురంలో ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమయంలో సనాకు ఓ లైట్ బాయ్ శివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా దారి తీసింది. శివకుమార్ సొంతూరు శ్రీకాకుళం జిల్లా. లైట్‌బాయ్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. ఓ ఈవెంట్ నిమిత్తం పిఠాపురం వెళ్లాడు.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి
వారం రోజుల కిందట హైదరాబాద్ నుంచి శివకుమార్ రాజమండ్రిలోని సనా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక ఎవరితో ఫోన్‌లో చాటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని తన కళ్లతో గమనించాడు. ఈ క్రమంలో సనా-శివకుమార్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే మొదటి భార్య కొడుకులు మహ్మద్ ఆలీ, ఉమర్‌లు సనా ఇంటికి వచ్చారు. శివకుమార్‌తో మాట్లాడి అక్కడి నుంచి పంపించి వేశారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి కర్రీ పట్టుకుని ఉమర్ వచ్చాడు.
సనా ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీలో నుంచి చూడగా సల్మా, సనా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఫోన్ చేసి పోలీసులకు ఈ విషయం చెప్పాడు. తన సిబ్బందితో తాళాలు పగులగొట్టి లోపల పరిశీలించారు పోలీసులు. మెడ మీద బలమైన కత్తిపోటు గాయాలు ఉన్నాయి. ఈ కారణంగా తల్లి-కూతురు అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు పోలీసులు.
పోలీసులకు చిక్కిన నిందితుడు
అయితే హత్య వెనుక అసలు విషయాలను ఉమర్ ను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మహ్మద్ ఆలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఫోటోలు వివరాలు తీసుకున్న పోలీసులు, పక్కాగా నిఘా పెట్టారు. చివరకు నిందితుడు శివకుమార్‌ను కొవ్వూరు ప్రాంతంలో అరెస్టు చేశారు. మరి పోలీసుల విచారణలో ఈ ఘటనకు సంబంధించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.