DC VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య నాలుగవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
Also Read: IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ లతో జాగ్రత్త… మఫ్టీ గెటప్ లో లేడీలు ?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా చూడాలంటే ఎలా?
ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ టాస్ ప్రక్రియ 7 గంటలకు ఉంటుంది. ఇవాళ ఒక్క మ్యాచ్ ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ ప్రసారాలు వస్తున్నాయి. జియో కస్టమర్ లందరికీ.. జియో హాట్ స్టార్ లో ఉచితంగా ప్రసారాలు అందిస్తున్నారు.
ఈ రెండు జట్ల మధ్య రికార్డులు
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్లే జరిగాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లో విజయం సాధించగా లక్నో సూపర్ జెంట్స్ 3 మ్యాచ్లో విజయం సాధించింది. ఢిల్లీ 19 పరుగుల తేడాతో చివరిగా గెలిచింది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అంతర్జాతీయ స్టేడియంలోనే జరిగింది. లక్నో సూపర్ జెంట్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య.. వైజాగ్ లో ఇవాళ తొలిసారి ఫైట్ జరగనుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండు హోం స్టేడియాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ అయితే మరొకటి విశాఖపట్నం. గత రెండు సీజన్లో నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఈసారి విశాఖపట్నంలో మ్యాచ్లన్నీ అట్టహాసంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read: SRH VS RR: వీళ్ళు కాటేరమ్మ కొడుకులు…RRపై 44 పరుగుల తేడాతో విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, KL రాహుల్, అక్షర్ పటేల్ © , ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, T నటరాజన్, ( IMPCT : కరుణ్ శర్మ నాయర్)/మోహిత్
లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XI: అర్షిన్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c/wk), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్ (IMPCT సబ్‌దర్ సింగ్/అకాష్‌బానీ అకాష్‌బానీ ఎ/ఎస్)