E-Paper
Advertisement

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్-ట్రాక్టర్ ఢీ, స్పాట్‌ లో 15 మంది

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్-ట్రాక్టర్ ఢీ, స్పాట్‌ లో 15 మంది
Advertisement

Road Accident: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న వ్యాన్-ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురు ఉన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

మకర సంక్రాంతి సందర్భంగా భోపాల్ జిల్లాలోని నర్మదాపురంలో పుణ్య స్నానం చేసి తిరిగి వస్తోంది ట్రాక్టర్‌. అదే సమయంలో నర్మదాపురం నుంచి ఎదురుగా వస్తున్న వ్యాన్.. ఆ ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈ రెండు వాహనాలు నుజ్జు అయ్యాయి. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు.

వ్యాన్‌లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మృతులను ముఖేష్ అహిర్వార్, బాబ్రీ బాయి, దీపక్, లక్ష్మీ బాయి, హరి బాయిలుగా గుర్తించారు, వీరంతా సిరోంజ్ నివాసితులు. రెండు వాహనాల్లోని ముగ్గురు పిల్లలు సహా పది మంది వరకు గాయపడ్డారు.

Advertisement

వ్యాన్-ట్రాక్టర్ ఢీ, స్పాట్‌‌లో ఐదుగురు మృతి

ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈలోగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. వాటిలో బాధితులను సమీపంలో ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఘటన స్థలంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్, బాధితులను నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ:  భార్యతో వలపు చిందులు.. భర్త వీడియో షూటింగ్.. చివరకు కటకటాల్లోకి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×