IND Vs ENG ODI 2025: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ ని 4 – 1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ పై అందరి దృష్టి పడింది. ఈ సిరీస్ ఫిబ్రవరి 6 గురువారం నుండి ప్రారంభం కాబోతోంది. మొదటి వన్డే నాగపూర్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఇరుజట్లకు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో సన్నాహకంగా ఉపయోగించుకుంటున్నాయి.
Also Read: Gongadi Trisha: తెలంగాణ తడాఖా చూపించా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్రిష !
ఈ క్రమంలో ఇప్పటికే భారత జట్టు ఆదివారం రోజు రాత్రి నాగపూర్ కి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, గిల్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు నేరుగా తమ జట్టు హోటల్ కి వెళ్లే ముందు నాగపూర్ విమానాశ్రయంలో కనిపించారు. ఇక ఈ జట్టు నేటినుండి ప్రాక్టీస్ సెషన్ లను ప్రారంభించింది. మొదటి వన్డే ఫిబ్రవరి 6 నాగపూర్, రెండవ వన్డే ఫిబ్రవరి 9న కటక్, మూడవ వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లో జరగనుంది.
అయితే ఈ సిరీస్ లోని మొదటి రెండు వన్డేలకు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండడం లేదని బిసిసిఐ తెలిపింది. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సిరీస్ లోని 3 వన్డేలు ఫిబ్రవరి 6, 9, 12.. రోజులలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ సిరీస్ కి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తోంది.
ఆ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 ఛానల్ తో పాటు.. ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అయితే జియో సినిమాకు చెందిన వయాకామ్ నెట్వర్క్, స్టార్ స్పోర్ట్స్ భాగస్వాములుగా మారడంతో హాట్ స్టార్ లో ఉచిత ప్రసారాలను నిలిపివేశారు. ఈ మ్యాచ్ లను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఇక ఈ మూడు వన్డేల సిరీస్ కి ఇరు జట్ల స్క్వాడ్ లను పరిశీలిస్తే..
Also Read: Mohammed Siraj: వివాదంలో సిరాజ్…తిలకం ఎందుకు పెట్టుకోవు అంటూ ట్రోలింగ్ ?
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రవీద్ర పన్‌వాల్ జడేజా
భారత పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్‌టన్, జోస్ బట్లర్, జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకిబ్ మహమూద్ వుడ్