E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు, స్పాట్‌లో

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు, స్పాట్‌లో
Advertisement

Road Accident: శీతాకాలం వేళ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా ముందు వాహనాలను గమనించలేక పోతున్నారు. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్‌‌లో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు, డివైడర్‌ని బలంగా ఢీ కొట్టింది. ఆపై గాల్లోకి ఎగిరింది. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో కారులో ఐదుగురు ఉన్నారు.

మృతుల్లో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వీరంతా చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం కారణంగా తెలుస్తోంది.

Advertisement

డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు

దీనికితోడు దట్టమైన పొగమంచు కారణంగా చెబుతున్నారు ఆ ప్రాంతవాసులు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

మృతులు ఎక్కడివారు, ఎక్కడికి వెళ్తున్నారు? అనేదానిపై గాయపడిన వారి నుంచి ఆరా తీస్తున్నారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నుజ్జైన కారుని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

ALSO READ: రగిలిపోతున్న నెల్లూరు, లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం

మరోవైపు గతరాత్రి హైదరాబాద్-మలక్‌పేట చౌరస్తా సమీపంలోని టీవీ టవర్స్ వద్ద ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆస్మాన్‌గడ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బస్సు, లారీలను ఢీ కొట్టింది. ఆపై మెట్రో బ్రిడ్జి కింద డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే పలువురు గాయపడ్డారు. దీంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×