E-Paper
Advertisement

Gadwal Road Accident: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ నీట్ కోచింగ్ కు వెళ్తూ ఒకరు మృతి

Gadwal Road Accident: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ  నీట్ కోచింగ్ కు వెళ్తూ ఒకరు మృతి
Advertisement

Gadwal Road Accident:  స్వేచ్ఛ, బ్యూరో: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాల య్యాయి. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్లితే… అయిజకు పట్టణానికి చెందిన రాము(17), మిట్టదొడ్డి గ్రామానికి చెందిన విష్ణు, గద్వాల గంజిపేటకు చెందిన వర్ధన్ ముగ్గురు హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని స్వంత గ్రామాలకు వచ్చారు.‌ రాము, విష్ణు‌ ఇద్దరు నీట్ ఎగ్జామ్ కు సిద్దమయ్యేందుకు హైదరాబాద్ కి బయలుదేరారు.

Also Read:Puri Jagannadh: ఆ రైటర్‌ క్రెడిట్ మొత్తం పూరి కొట్టేశాడా? అందుకేనా ఈ పరాజయాలు? 

ఆర్టీసి బస్సును రైల్వే స్టేషన్ ముందు

Advertisement

ఈ క్రమంలో గద్వాల రైల్వే స్టేషన్ కు వెళ్లారు. హైదరబాద్ వెళ్లే రైళ్లుకు కొంత సమయం ఉందని తెలియడంతో గద్వాలలో ఉంటున్న వర్దన్ ముగ్గురు కలిసి బైక్ మీద గద్వాల్ టౌన్ లోకి వెళ్తున్న క్రమంలో గద్వాల్ నుంచి అయిజకు వెళ్తున్న ఆర్టీసి బస్సును రైల్వే స్టేషన్ ముందున్న అయిజ రోడ్డుపై బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న రాము(17) సంఘటన స్థలంలో‌ మృతి చెందాడు. మిట్టదొడ్డికి చెందిన విష్ణు, గద్వాల్ కు చెందిన వర్దన్ కు గాయాలు కాగా చికిత్స‌కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసుచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

న్యాయం చేయాలని ధర్నా

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ‌ టి.శ్రీను, గద్వాల టౌన్ ఎస్ఐ‌ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుసకవచ్చారు. రోడ్డు ప్రమాదానికి గల కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: Street Lights: ఢిల్లీ తరహాలో స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్… టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×