E-Paper
Advertisement

Street Lights: ఢిల్లీ తరహాలో స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్… టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Street Lights: ఢిల్లీ తరహాలో స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్… టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Street Lights: స్వేచ్ఛ, బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పౌర సేవలను మరింత మెరుగుగా అందించే దిశగా మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సిద్ధమయ్యాయి. అత్యవసర సేవల్లో ముఖ్యమైన రోడ్ల నిర్వహణ, స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ ను ఈ సారి మరింత మెరుగ్గా అందించే దిశగా జీహెచ్ఎంసీ కృషి చేస్తుంది. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ ( సీఆర్ఎంపీ) కింద రూ.3145 కోట్ల వ్యయంతో దాదాపు వెయ్యి 14 కిలోమీటర్ల పొడువున రోడ్ల నిర్వహణ, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 7,60,591 స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ కోసం రూ. 1341.60 కోట్లతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతుంది. మరో నెల రోజుల్లోపు టెండర్ల ప్రక్రియను చేపట్టి, నిర్వహణ ఏజెన్సీలకు బాధ్యతలను అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఈ రెండు ప్రతిపాదనలకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్న విషయానికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో గ్రేటర్ పరిధిలోని సుమారు 3.53 లక్షల స్ట్రీట్ లైట్లకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ను చేపట్టిన జీహెచ్ఎంసీ త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్ర్రపోజల్ (ఆర్ఎఫ్ ఫీ) ప్రక్రియను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో అప్పటి జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు 3.53 లక్షల స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరగా, సర్కారు ఈ ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టి, గత సంవత్సరం నవంబర్ 25న కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రీయాంబుల్ ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. వీటి విలీనంతో దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది. దీంతో కోర్ అర్బన్ రీజియన్ లోని స్ట్రీట్ లైట్ల సంఖ్య కూడా 7,60,591 కు పెరిగింది. జీహెచ్ఎంసీని ఆ తర్వాత నెలన్నర రోజులకే ఫిబ్రవరి 11న సర్కారు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి అంటూ మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెల్సిందే. కోర్ అర్బన్ రీజియన్ మొత్తం స్ట్రీట్ లైట్ల నిర్వహణకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సర్కారు ఆదేశించింది.

Also Read: JC Prabhakar Reddy: ప్రజలే దేవుళ్లు.. మున్సిపల్ కార్యాలయమే దేవాలయం, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్

ఏకంగా పదేళ్ల నిర్వహణ బాధ్యతలు

కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ ( సీఆర్ఎంపీ) కింద సుమారు 1014 కిలోమీటర్ల పొడువున రోడ్లకు, కోర్ పరిధిలోని దాదాపు ఏడున్నర లక్షల స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు ఏకంగా పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ లో భాగంగా కేవలం వెలిగే స్ట్రీట్ లైట్లకు మాత్రమే బిల్లులు వర్తింపజేసేలా అధునాతన పద్దతిని అందుబాటులోకి తేనున్నారు. ఇలాంటి విధానం ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు, ఢిల్లీ మహానగరంలోని స్ట్రీట్ లైట్లకు మాత్రమే అమలు చేస్తున్నారు. ఇక రోడ్డు మెయింటనెన్స్ కు సంబంధించి కూడా పదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న ఏజెన్సీలకు అధికారులు పలు నిబంధనలను కూడా విధించారు. సీఆర్ఎంపీ కింద అప్పగించనున్న రోడ్లలో ఏజెన్సీలు ఏడాదికోసారి లేన్ మార్కింగ్ చేయటంతో పాటు ఈ రోడ్లలో స్వీపింగ్ మిషన్లతో పారిశుద్ధ్య పనులను చేపట్టాలి. దీనికి తోడు ఫుట్ పాత్ లు, సెంట్రల్ మీడియన్లలో కూడా నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో పాటు సైనేజీ బోర్డును ఏర్పాటు చేయటంతో పాటు క్యాచ్ పిట్లు, మ్యాన్ హోళ్లకు కూడా రిపేర్లను చేయాల్సి ఉంటుంది.

ఒక్కో స్ట్రీట్ లైట్ కు నెలకు రూ. 186

స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి గతంలో ఉన్న విధానానికి కాస్త భిన్నమైన విధానాన్ని ఈ సారి జీహెచ్ఎంసీ అనుసరించనుంది. కేవలం వెలిగే లైట్లకు మాత్రమే మెయింటనెన్స్ ఛార్జీలను చెల్లించేలా సిద్దమైనట్లు తెలిసింది. ఢిల్లీ తరహా విధానాన్ని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకురానుంది. ఇదే విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు కాకతీయ ఎనర్జీ సర్వీసు లిమిటెడ్ అనే సంస్థ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఢిల్లీలో కేవలం 3.96 లక్షల స్ట్రీట్ లైట్లుండగా, పన్నెండేళ్ల మెయింటనెన్స్ పీరియడ్ కు అక్కడి అధికారులు 1030 కోట్లను చెల్లిస్తున్నట్లు తెలిసింది. త్వరలో జీహెచ్ఎంసీ చేపట్టనున్న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్ పీ) ప్రక్రియలో ఒక్కో లైట్ల మెయింటనెన్స్ ఛార్జీలు రూ.186 నుంచి రూ. 200 వరకు గానీ పెరిగే అవకాశంతో పాటు రూ. 175కు తగ్గే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

పేమెంట్ ఏ పద్దతిలో?

కోర్ అర్బన్ రీజియన్ లోని మొత్తం 7,60,591 స్ట్రీట్ లైట్లకు నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు టెండర్ల ఎంపిక కోసం జీహెచ్ఎంసీ ప్రక్రియ చేపడుతున్నా, చెల్లింపులు ఎలా జరపాలన్న విషయంపై కూడా మూడు కార్పొరేషన్ల కమిషనర్లు చర్చించుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం నిర్వహణ కోసం ఏజెన్సీలను ఎంపిక చేసే బాధ్యతను నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీయే పదేళ్ల ఈ నిర్వహణ వ్యయాన్ని తన ఖజానా నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మూడు కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ అతి పెద్ద కార్పొరేషన్ కావటంతో పాటు అత్యధిక స్ట్రీట్ లైట్లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావటం, గతంలో ఈ తరహా బాధ్యతలను జీహెచ్ఎంసీ నిర్వర్తించిన అనుభవం ఉన్నందున చెల్లింపుల బాధ్యత కూడా జీహెచ్ఎంసీకే అప్పగించి, మిగిలిన రెండు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహణ వ్యయంలో తమవంతు వాటాను జీహెచ్ఎంసీ ఖజానాకు చెల్లించేందుకు సిద్దమైనట్లు తెలిసింది.

Also Read: Eesha Rebba: చీరకట్టులో ఈషా రెబ్బా అందాలు.. ఆ సోయగానికి ఫిదా అవ్వాల్సిందే!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×