Puri Jagannadh: ‘పోకిరి’ (Pokiri) సినిమా తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) నుంచి అలాంటి సాలిడ్ హిట్ రాలేదనే చెప్పాలి. మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ కాస్త పరవాలేదని అనిపించినా, మిగతావన్నీ చాలా వరకు పరాజయాలే చవి చూశాయి. ఇక ఎన్నో ఆశలతో పాన్ ఇండియా స్థాయిలో ఆయన రూపొందించిన ‘లైగర్’ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. అప్పటి పూరిలో ఉన్న టాలెంట్ ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు? అని ఆయన అభిమానులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పుంజుకునేందుకు పూరీ జగన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పూరి ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా, ఇప్పుడో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతూ.. ఆయన పేరును మరింత డౌన్ చేస్తోంది. అదేంటంటే..
Also Read- Sridevi Drama Company: టీవీ చరిత్రలోనే మొదటి సారి… శ్రీదేవి డ్రామా కంపెనీ పై ప్రశంసలు..
పూరి జగన్ అనగానే మనకు గుర్తొచ్చేది పంచ్ లైనర్స్. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, అప్పటికప్పుడు పూరి డైలాగ్స్ రాసేస్తారని, ఆయనతో పని చేసిన వారెందరో చెబుతూనే ఉంటారు. కానీ, పూరి మాత్రం ఇంకెవరో టాలెంట్‌ని తన టాలెంట్ అని చెప్పుకుని, ఇప్పటి వరకు ఈ పేరు గడించారనేలా సోషల్ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. అవును, రైటర్ తోట ప్రసాద్ (Thota Prasad) చెప్పినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. పూరి ఇంకొకరికి రావాల్సిన క్రెడిట్‌ని తన పాకెట్‌లో వేసుకుని, స్టార్ రైటర్, డైరెక్టర్ అనే పేరుతో చలామణీ అవుతున్నాడనే భావించవచ్చు. అసలింతకీ రైటర్ తోట ప్రసాద్ ఏం చెబుతున్నారంటే..
Also Read- Priyanka Chopra: చరిత్ర సృష్టించిన ప్రియాంక చోప్రా.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా!
మహేష్ బాబు (Mahesh Babu)తో చేసిన ‘పోకిరి’కి ఆయన ఎంతగానో కంట్రిబ్యూట్ చేశాడట. కానీ టైటిల్ కార్డ్స్‌లో కూడా ఆయన పేరు వేయలేదట. తను రాసిన డైలాగులు, సీన్లను మెచ్చుకుంటూ.. జర్నలిస్ట్‌లు భలే రాశారు సార్ అని పూరిని అడిగితే.. ఎప్పుడూ తన పేరు చెప్పలేదని, పైగా ఎంబ్రాసింగ్‌గా ఫీలయ్యేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘143’ సినిమాకు కథా సహకారం అని పేరు వేశారట కానీ, ‘సూపర్’ సినిమాకు వేయలేదట. పైగా తనకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట. ఇబ్బందుల్లో ఉన్నాను.. నెల నెల ఖర్చులు మాత్రమే తీసుకోండి అని అడిగారట. ‘పోకిరి’ తర్వాత చేసిన ‘దేశముదురు’ సినిమాకు సెపరేట్ పేమెంట్ ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని, అప్పుడే ఇద్దరి మధ్య మిస్ అండర్‌స్టాండింగ్స్ వచ్చాయని తోట తెలిపారు. ఆయనపై ఐటీ రైడ్స్ జరిగిన టైమ్‌లో బ్యాలెన్స్ ఇవ్వబోతే.. ఇప్పుడు వద్దన్న తోట ప్రసాద్ మాటలకు పూరి ఎమోషనల్ అయ్యారట. అప్పుడే ఒక మాట ఇచ్చారట. ఇకపై పూరి జగన్ ఇండస్ట్రీలో ఉన్నంత కాలం, తన బ్యానర్‌లో ఏ సినిమా తీసినా.. తనతో పాటే ఉండాలని కోరారట పూరి జగన్నాథ్. కానీ, ఆ తర్వాత ఆ ప్రామిస్‌పై కూడా పూరి నిలబడలేదని తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
Also Read- Singer Mangli: మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. బూతు పాటపై కేసు నమోదు..