RTC Driver Suicide: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం న్యాల్ కల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలోకి దూకి ఆర్టీసీ డ్రైవర్ పాపయ్య (49) ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణఖేడ్ డిపో డ్రైవర్ గా పనిచేస్తున్న పాపయ్య.. ఆత్మహత్యకు ముందు కూతురికి వీడియో కాల్ చేశారు. నది దగ్గర నిలబడి.. తాను చనిపోతున్నట్లు తెలియజేశాడు.
దీంతో కూతురు ఇచ్చిన సమాచారంతో నది ఒడ్డుకు చేరుకున్న పోలీసులు.. అక్కడ పాపయ్య దుస్తులు, బైక్ గుర్తించారు. అనంతరం నదిలో పాపయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పాపయ్య మృతదేహం వారి కంటపడింది. దీంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Best Time to Buy AC: కొత్త ఏసీ ఎప్పుడు కొనాలి? ఉత్తమ సమయం ఏది? చౌకగా ఎలా పొందొచ్చు!
ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న పాపయ్య స్వస్థలం.. ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుద్నూరు పోలీసులు తెలియజేశారు. పాపయ్య మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే కూతురుతో మాట్లాడిన క్రమంలో.. ‘మీరు ధైర్యంగా ఉండండి. నాకు భయంగా ఉంది. ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని పాపయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ భయానికి కారణం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: 75 inch Tv Discount: 75 ఇంచ్ స్మార్ట్ టీవీలపై 67 శాతం వరకు తగ్గింపు.. సోనీ టీవీలపై 55 శాతం డిస్కౌంట్