E-Paper
Advertisement

Stray Dogs Attack: సంగారెడ్డి జిల్లాలో మరోమారు రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఐదేళ్ల బాలుడిపై దారుణంగా..

Stray Dogs Attack: సంగారెడ్డి జిల్లాలో మరోమారు రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఐదేళ్ల బాలుడిపై దారుణంగా..
Advertisement

Stray Dogs Attack: సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు మరోమారు రెచ్చిపోయాయి. ఆర్కే నగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న శివ (5) అనే చిన్నారిపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. బాలుడు తేరుకునే లోపే కుక్కలు విచక్షణారహితంగా కరవడంతో శివకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

గాయపడిన బాలుడిని కాలనీవాసులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే గాయాలు లోతుగా ఉండటంతో, మెరుగైన వైద్యం నిమిత్తం వైద్యుల సూచన మేరకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఆర్కే నగర్ కాలనీలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. తమ పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

Advertisement

అయితే ఈ ఘటనపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇంద్రేశం మున్సిపాలిటీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా బయటకు రావాలంటే భయమేస్తోందని వాపోతున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే నేడు ఒక చిన్నారి ప్రాణాల మీదకు వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.

Also Read: జూబ్లీహిల్స్‌లో రెచ్చిపోయిన దొంగలు.. తాళ్లతో కట్టేసి.. కత్తితో బెదిరించి.. ఆ గ్యాంగ్ పనేనా?

Advertisement

మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి, వీధి కుక్కల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జనావాసాల్లో కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ చేయడంతో పాటు, ప్రమాదకరంగా మారిన కుక్కలను వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే యంత్రాంగం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×