E-Paper
Advertisement

Rapido Driver Crime: జల్సాలకు బానిసై.. రక్తం రుచి మరిగిన ర్యాపిడో డ్రైవర్: మామిడిపల్లి కేసు మిస్టరీ వీడింది

Rapido Driver Crime: జల్సాలకు బానిసై.. రక్తం రుచి మరిగిన ర్యాపిడో డ్రైవర్: మామిడిపల్లి కేసు మిస్టరీ వీడింది
Advertisement

Rapido Driver Crime: జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం నేరాల బాట పట్టిన ఓ ర్యాపిడో డ్రైవర్ ఘాతుకం ఆలస్యంగా వెలుగుచూసింది. కేవలం బంగారం కోసం ఒంటరి మహిళపై కత్తితో దాడి చేసి, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో ఈ నెల 22న జరిగిన ఈ చైన్ స్నాచింగ్, హత్యాయత్నం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సత్తయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జగన్ ఉపాధి కోసం ర్యాపిడో (Rapido) బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడం, మద్యానికి బానిస కావడం, జల్సాలకు అలవాటు పడటంతో అడ్డదారులు తొక్కాడు. ర్యాపిడో బుక్ చేసుకునే వారిలో ఎవరైనా ఒంటి నిండా బంగారం ధరించి వస్తే, వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కత్తిని కూడా కొనుగోలు చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం ధరించిన వారు ఎవరూ అతని బైక్ ఎక్కకపోవడంతో జగన్ అసహనానికి గురయ్యాడు. ఎలాగైనా దొంగతనం చేయాలని మరో ప్లాన్ వేశాడు.

Advertisement

ఈ క్రమంలో ఈ నెల 22న కంది మండలం మామిడిపల్లి శివారులో పశువులు కాస్తున్న ఓ మహిళ జగన్ కంట పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును చూసి ఎలాగైనా దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపాడు. అదను చూసి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో బలంగా పొడిచాడు. మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో, విచక్షణ కోల్పోయిన జగన్ ఆమె కడుపులో మరోసారి కత్తితో పొడిచి, గొలుసు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ర్యాపిడో డ్రైవర్ జగన్ కదలికలను గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను, నేరానికి వాడిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం అమాయకుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

Advertisement

Read Also: Hyderabad News: రూటు మార్చిన మహిళా టెక్కీ.. బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×