Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్‌లోని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై థార్ వాహనం బీభత్సం సృష్టించింది. చెరువు కట్ట వద్ద డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై పక్కన నిల్చున్న యువతి, యువకుడిపై దూసుకెళ్లింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది.
యువతి, యువకుడిపై దూసుకెళ్లిన థార్ కారు..
థార్ వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. బాధితులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: విద్యార్థులకు బిగ్ అలర్ట్..! తెలంగాణలో కాలేజీలు బంద్..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ హైవేపై ఘటన
అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం
అక్కడే ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లిన వాహనం
స్పాట్ లోనే చనిపోయిన యువకుడు
పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మృతి
ప్రమాదంలో ముగ్గురికి గాయాలు pic.twitter.com/Az6VwiKjvc
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025