Vyjayanthi Movies:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కాలంలోనే స్థాపించబడిన వైజయంతి మూవీస్ బ్యానర్ ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్లను మొదలుకొని ఆ తర్వాత చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి తమ సంస్థ కంటూ ఒక పేరును తీసుకొచ్చారు అశ్వినీ దత్ (Ashwini Dutt).. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో వైజయంతి మూవీ మేకర్స్ పని అయిపోయింది.. ఇక బుట్ట సర్దాల్సిందే అనే వార్తలు రాగా.. అనూహ్యంగా ‘కల్కి2898AD’ సినిమా చేసి గట్టి కం బ్యాక్ ఇచ్చారు అశ్విని దత్. భారీ బడ్జెట్లో వచ్చిన ఈ సినిమా అంతకుమించి లాభాలను అందించింది. దీంతో వైజయంతి మూవీస్ దాదాపు సేవ్ అవ్వడమే కాకుండా లాభాల బాట పట్టింది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వైజయంతి మూవీస్ బ్యానర్ వారు తీసుకున్న నిర్ణయం చూసి ప్రతి ఒక్కరు ఈ నిర్మాత లాగా ఉండాలి అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. గుంటూరు ఏరియాలో ఒక సినిమా హక్కులు తీసుకోవాలి అంటే నిర్మాతలు 4, 5కోట్లకు ఆ సినిమా హక్కులను ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఆ సినిమా సక్సెస్ అయితే ఓకే.. ఒకవేళ డిజాస్టర్ అయ్యిందంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం మిగులుతుంది. కానీ వైజయంతి మూవీస్ నిర్మాత అలా కాదు.. తాజాగా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఛాంపియన్. శ్రీకాంత్ కొడుకు రోహన్ మేక నటిస్తున్న ఈ సినిమా గుంటూరు హక్కులను అడ్వాన్స్ రూపంలో తీసుకోమని అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారట. అంతేకాదు ఈ సినిమా హక్కులను ఎన్నారైలకు ఇవ్వకుండా కేవలం లోకల్ వాళ్లకే ఇచ్చేటట్టు నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ALSO READ:Bigg Boss 9: నన్ను ఒక బలి పశువుల వాడుకున్నారు.. బిగ్ బాస్ ను కడిగిపారేసిన దమ్ము శ్రీజ.!
ఈ నిర్ణయం అందరికీ లాభదాయకంగా అనిపిస్తోంది. ఈ సినిమా హక్కులను అడ్వాన్స్ రూపంలో తీసుకుంటే ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే నష్టాన్ని మేమే భర్తీ చేస్తామని కూడా నిర్మాత అశ్విని దత్ హామీ కూడా ఇచ్చారట.. ఏది ఏమైనా గుంటూరు డిస్ట్రిబ్యూటర్లను సేవ్ చేయడానికి ఇలా అడ్వాన్స్ రూపంలో సినిమా హక్కులను అమ్మేలా ప్లాన్ చేశారట అశ్విని దత్. ఇకపోతే గతంలో మిరాయ్ సినిమా విషయంలో కూడా టీజీ విశ్వప్రసాద్ ఇలాంటి పద్ధతినే ఫాలో అయిన విషయం తెలిసిందే.. ఆయన కూడా దాదాపు అన్ని ఏరియాలలో అడ్వాన్స్ రూపంలోనే సినిమా హక్కులను అమ్మేశారు. ఆ తర్వాత అలాంటి తరహాలోనే ఇప్పుడు వైజయంతి బ్యానర్స్ అధినేత అశ్వినీ దత్ కూడా నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిభాష ఇండస్ట్రీలో కూడా నిర్మాతలు ఇలా ఆలోచిస్తే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సిన అవసరం ఉండదు అని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు .ఏది ఏమైనా ఈ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు కురిసేలా చేస్తోంది.