E-Paper
Advertisement

Honor killing Case: నా కూతురు 4 నెలల గర్భవతి.. ప్లాన్ ప్రకారమే ప్రియుడి హత్య? బీరంగూడ కేసులో ట్విస్టులు

Honor killing Case: నా కూతురు 4 నెలల గర్భవతి.. ప్లాన్ ప్రకారమే ప్రియుడి హత్య? బీరంగూడ కేసులో ట్విస్టులు
Advertisement

Honor killing Case: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో పరువు హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? ఈ కేసు నుంచి అమ్మాయి వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు అక్కడ ఏం జరిగింది? యువతి తల్లి ఏం చెప్పింది? శ్రవణ్ సాయి స్నేహితులు ఏమంటున్నారు? ఇంతకీ అమ్మాయి గర్బవతి వ్యవహారం వెనుక అసలేం జరిగింది?

Advertisement

బీరంగూడ కేసులో కొత్త కొత్త ట్విస్టులు

Advertisement

సంగారెడ్డి జిల్లాలో బీరంగూడలో పరువు హత్య కేసులో షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడు శ్రవణ్ సాయి అనుకోని పరిస్థితి హత్యకు గురయ్యాడు. కావాలనే యువతి కుటుంబసభ్యులు హత మార్చారా? లేకుంటే అబ్బాయి తప్పు ఏమైనా ఉందా? అసలు సాయిని ఇంటికి పిలిచిన ప్లాన్ ఎవరిది?

పరువు హత్య కేసులో యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో యువతి తల్లిని బిగ్ టీవీ పలకరించింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి తల్లి సిరి కొన్ని విషయాలు బయటపెట్టింది. తన కూతురు నాలుగు నెలల గర్భవతి అని మనసులోని మాట బయటపెట్టింది. గండిమైసమ్మ దగ్గర పార్క్‌లో వీరిద్దరు ఏకాంతంగా కలిశారన్నది యువతి తల్లి ప్రధాన ఆరోపణ. 

ప్లాన్ ప్రకారమే ప్రియుడి హత్య?

తన కూతురు మెసేజ్ చేస్తేనే  శ్రవణ్ సాయి ఇంటికి వచ్చాడని తెలిపింది. ప్రెగ్నన్సీ సంగతి మా అమ్మకి తెలిసిందంటూ తన కూతురు.. అబ్బాయితో చెప్పినట్టు తెలిపింది. ఈ విషయంలో తన కూతురు తప్పు చేసిందని, అందువల్లే ఆమెని కొట్టానని వెల్లడించింది. కూతుర్ని కొడుతుంటే శ్రవణ్ సాయి మధ్యలోకి అడ్డంగా వచ్చాడని అంటోంది.

అయినా ఇంకొకరి పిల్లల్ని తానెందుకు కొడతానన్నది ఆమె వెర్షన్. ఈ క్రమంలో శ్రవణ్ సాయికి దెబ్బలు తగిలాయని, ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది. యువకుడితో తాను ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేదన్నది యువతి తల్లి మాటలు. 

నా కూతురు 4 నెలల గర్భవతి

శ్రవణ్ సాయి స్నేహితులు చెప్పిన మాటలు మరోలా ఉన్నాయి. క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం వల్లే చనిపోయాడని అన్నట్లు తెలిసిందన్నారు. బ్యాట్‌తో కొట్టిన దెబ్బలు కావని అంటున్నారు. ఇందులో చాలా మంది ప్రమేయముందని భావిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు వెళ్లిన వ్యక్తి, సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆసుపత్రిలో జాయిన్ చేశారన్నారు.

అమ్మాయివాళ్లు శ్రవణ్‌ని బెదిరించారని అంటున్నారు. ఇంట్లో నుంచి అమ్మాయి బయటకు రావడం, తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక  ఒకానొక దశలో శివ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని వివరించారు.

కూతురు ఫోన్ నుంచి ఆమె తల్లి కాల్ చేసి ఇంటికి రావాలని కబురు పెట్టిందన్నారు. సాయిని టార్చర్ చేసి చంపినట్టు కనిపిస్తోందన్నారు. యువకుడు ఎక్కడివాడు? ఆస్తులున్నాయా? పేరెంట్స్ సంగతి ఏంటి? ఇవన్నీ యువతి బంధువులు కనుకున్నారని అంటున్నారు. 

ఏడాది నుంచి యువతిని శ్రవణ్‌సాయి కలవలేదంటున్నారు అతడి ఫ్రెండ్స్. ఏడాది నుంచి కలవకపోతే యువతి గర్భవతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆరేడేళ్ల నుంచి యువతి తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందని చెబుతున్నారు. ఆ వ్యక్తి తనను వేధిస్తున్నాడని, యువతి ఎన్నోసార్లు సాయితో చెప్పిందంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రవణ్‌ సాయిని యువతి బలవంతపెడితే, తాము నచ్చజెప్పి ఆమెను ఇంటికి పంపామన్నారు. అప్పుడు తమకు కత్తులు చూపించి, చంపేస్తామని బెదిరించారని చెబుతున్నారు.

ALSO READ: కార్లలో నోట్ల కట్టలు.. మూడున్నర కోట్లపైనే

సాయి-శ్రీజ ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాలు కొద్దిరోజులుగా మాటలు ఆడుకున్నట్లు తెలిసింది.  యువతీ యువకులు చదువుకోవడంతో  కాబట్టి కొద్దిరోజులు ఆగాలని ప్రపోజల్ వచ్చినట్టు తెలుస్తోంది. శివ పెదనాన్న పెళ్లికి ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదన్నారు. కులాలు వేరని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడట.

శ్రవణ్ సాయి సొంతూరు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందినవాడు. సాయి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి మరణించాడు. ఈ క్రమంలో నానమ్మ, పెదనాన్న సంరక్షణలో శ్రవణ్ సాయి పెరిగాడు. ప్రస్తుతం సాయి మేడ్చల్ జిల్లా మైసమ్మగూడెంలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×