E-Paper
Advertisement

Eluru Crime News: అమ్మతనం భారమా.. సమాజమంటే భయమా.. పసిబిడ్డను 4వ అంతస్థు నుండి..

Eluru Crime News: అమ్మతనం భారమా.. సమాజమంటే భయమా.. పసిబిడ్డను 4వ అంతస్థు నుండి..
Advertisement

Eluru Crime News: ఆ శిశువు ఎందుకు లోకంలోకి వచ్చిందో తెలియదు. వచ్చిన మరుక్షణం ప్రాణాలు వదిలింది. ఏ తల్లికి భారమైందో కానీ, ఆ శిశువును ఏకంగా నాలుగో అంతస్థులో నుండి పడవేసినట్లు తెలుస్తోంది. అమ్మ కాని అమ్మ వయస్సులో అమ్మగా మారి, సమాజం ఏమంటుందోనన్న భయంతో ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే ప్రశ్నలు అక్కడంతా వ్యాపించాయి. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో జరగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

ఏలూరు లోని అశోక్ నగర్ వద్ద అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ శిశువు మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ నిర్వహించి, మృతదేహాన్ని అక్కడి నుండి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ శిశువు మృతి వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్లు ఏలూరులో ప్రచారం సాగుతోంది.

Advertisement

అసలు కథ ఇదేనా?
ఏలూరులో శిశువు మృతి వెనుక ఉన్న కథ ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. ఓ హాస్టల్ లో ఉండే అమ్మాయి, గర్భాన్ని దాల్చింది. చదువు కోసం వచ్చిన అమ్మాయి గర్భాన్ని దాల్చడంతో అక్కడి సిబ్బంది ఖంగు తిన్నారట. ఆ అమ్మాయిని రహస్యంగా ఉంచి, విషయం బయటకు పొక్కకుండా అదే హాస్టల్ లో ఉంచారు. ప్రసవ సమయం రాగానే, వారే ప్రసవాన్ని పూర్తి చేసి, ఆ శిశువును బయటకు విసిరేసినట్లు ప్రచారం సాగుతోంది. 4 అంతస్థుల మేడ నుండి అప్పుడే పుట్టిన బిడ్డను విసిరివేశారని, అందుకే ఆ బిడ్డ చనిపోయినట్లు వదంతులు వ్యాపించాయి. తానేమీ నేరం చేయకపోయినా ఆ పసిపాప అప్పుడే పుట్టి, మరుక్షణంలో లోకానికి దూరమైంది. తప్పు తనది కాకున్నా, శిక్ష మాత్రం ఆ బిడ్డ అనుభవించిందని స్థానికులు చర్చించుకోవడం విశేషం.

Also Read: Manchu Manoj Injured: తండ్రీ కొడుకుల గొడవల్లో మంచు మనోజ్‌కు గాయాలు.. హాస్పిటల్‌లో చికిత్స

Advertisement

పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఏలూరులో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనా, ఇంతకు ఆ శిశువు ఎవరు, కారకులు ఎవరనే విషయాలు పోలీసుల దర్యాప్తులో బహిర్గతం కావాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ ఘాతుకానికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×