Manchu Manoj injured:తెలుగు చలనచిత్ర పరిశ్రమలు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు (Mohan Babu). క్రమశిక్షణకు మారుపేరైన ఈయన తాజాగా తన కొడుకు మంచు మనోజ్(Manchu Manoj) తో ఆస్తి తగాదాలు పెట్టుకున్నట్లు గత కొన్ని గంటల క్రితం వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్, మంచు మోహన్ బాబు విద్యాసంస్థల లో కీలకంగా పని చేసే వినయ్(Vinay) అనే వ్యక్తి రౌడీలతో కలిసి తన తండ్రి ప్రమేయంతో దాడి చేశారట. దాంతో గాయాలతోనే పిఎస్ మెట్లు ఎక్కిన మంచు మనోజ్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇకపోతే ఆ దాడిలో గాయాలవడంతో మంచు మనోజ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
గాయాలతో హాస్పిటల్లో చేరిన మంచు మనోజ్..
ఆస్తి విషయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు అనుచరులు వినయ్ తనపై దాడి చేసినట్లు మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. వినయ్ తో పాటు మరికొంతమంది తనను కొట్టారని అంతే కాదు తనతో పాటు తన భార్య భూమా మౌనిక రెడ్డి(Mounika Reddy) పై కూడా చేయి చేసుకున్నారని మంచు మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. కుటుంబ సభ్యులు మంచు మనోజ్ ను ఆసుపత్రిలో చేర్పించారు. బంజారాహిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్ లో మనోజ్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన భార్య భూమా మౌనిక మరి కొంతమంది సహాయంతో ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యంగా కాళ్లకు బలమైన గాయం అవ్వడంతో మనోజ్ కి వైద్యులు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
గతంలోనే గొడవలు..
గత ఏడాది క్రితమే మంచు సోదరులైన మనోజ్, విష్ణు మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మనోజ్ అనుచరుడి పైన విష్ణు దాడి చేయడం, ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు అతిధి గానే వచ్చి వెళ్లిపోయారు. దీనికి తోడు ఆలీతో సరదాగా కార్యక్రమంలో అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఉన్న గొడవలపై క్లారిటీ ఇవ్వమని హోస్ట్ ఆలీ ప్రశ్నించగా.. తాను వేసుకున్న కోట్ కూడా విప్పుతూ సీరియస్ అయిపోయారు మంచు విష్ణు. మా ఇంట్లో గొడవలు బయట వాళ్లకి ఎందుకట అంటూ ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే గొడవలు ఉన్నాయనే వార్తలు కొంతవరకు స్పష్టమయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా మనోజ్ హాస్పిటల్ లో చేరడంతో అందరూ కన్ఫామ్ అవుతున్నారు.ఇకపోతే మంచు మనోజ్ కూడా ఎక్కువగా ఫ్యామిలీలో కలిసిన దాఖలాలు ఎక్కువగా కనిపించవు. ముఖ్యంగా మనోజ్ ఎప్పుడూ కూడా తన అక్క లక్ష్మితోనే కనిపిస్తూ ఉంటాడు. అటు విష్ణు కూడా తన తండ్రికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ ను దూరం పెట్టారని తెలుస్తోంది. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి