BigTV English

Jani Master: డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగింపు

Jani Master: డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగింపు

Jani Master: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ ఒకరు. నితిన్ నటించిన ద్రోణ సినిమాలో పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత డీ రియాల్టీ షోలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ షో తోనే జానీ మాస్టర్ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో జానీ మాస్టర్ ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలలో రామ్ చరణ్ సాంగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో జిగేల్ రాణి అనే పాటను కొరియోగ్రఫీ చేశాడు జాని. ఈ పాట జాని మాస్టర్ కు విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది.


ఒకవైపు సక్సెస్ తో కొనసాగుతున్న కూడా మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాత్మకంగా మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ. ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం విధితమే. జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి, చంచల్గూడా సెంట్రల్ జైలులో 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చేసాయి. జానీ మాస్టర్ కేసు కు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణం సదరు బాధితురాలు పుష్ప 2 సినిమాకి పనిచేయడం. బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్ గా ఉంటారని, అలానే గీత ఆర్ట్స్ లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారు. ఆదివారం జరిగిన డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదో సారి . కొంతమంది జానీ మాస్టర్ అభిమానులు కూడా ఈ కేసు విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన ఎవరికి రాలేదు. ఈ తరుణంలో జానీ మాస్టర్ ను డాన్సర్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read : Darshan: కోర్టు రూల్స్‌ను ఉల్లంఘించిన దర్శన్.. సీరియస్ యాక్షన్ తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×