Medak Crime: డబ్భు పాపిష్టిది.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మ వద్దని చాలామంది చెబుతారు. దీనికారణంగా మంచి-చెడుల మధ్య తేడా తెలియకుండా పోతుందని అంటుంటారు. డబ్బుకి ఎంతటి వారైనా లొంగిపోతారు. తాజాగా కేవలం 22 రూపాయలకు రూమ్ మేట్‌ని చంపేశాడు ఓ వ్యక్తి. సంచలనం రేపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
మెదక్ జిల్లాలో దారుణం.. పాత బకాయి చిచ్చు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కేవలం 22 రూపాయలకు రూమ్ మేట్‌ని హత్య చేశాడు మరొక వ్యక్తి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెదక్ జిల్లా అనంతసాగర్ శివారులోని సప్తగిరి కెమికల్ పరిశ్రమ ఉంది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పని చేస్తున్నారు.
యూపీకి చెందిన మహ్మద్ సిరాజ్, అదే రాష్ట్రానికి చెందిన మహేశ్‌కుమార్ ఒకే గదిలో ఉంటున్నారు. ఓకే కంపెనీలో పని చేస్తున్నారు. జనవరి 15న అంటే పండుగ రోజు మద్యం సేవించేందుకు వీరిద్దరు తోటి స్నేహితులతో బయటకు వెళ్లారు. గ్రామ శివారులో మద్యం పార్టీకి అటెండ్ అయ్యారు. మద్యం తాగితే అసలు నిజాలు బయటకు వస్తాయని చెబుతుంటారు.
కేవలం రూ. 22 రూమ్ మేట్‌ని చంపిన మరో వ్యక్తి
వీరి విషయంలో అదే జరిగింది. మద్యం తాగుతుండగా సిరాజ్ తనకు ఇవ్వాల్సిన 22 రూపాయల విషయంలో మహేశ్‌కుమార్ గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో మహేశ్.. సిరాజ్ తలను చెట్టుకి గట్టిగా మోదాడు. ఆ తర్వాత రాయితో తలపై బలంగా కొట్టాడు. ఈ తర్వాత సిరాజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన తర్వాత అక్కడి నుంచి మహేశ్ కుమార్ పరారయ్యాడు. ఈ లోగా వారితో వచ్చిన మిత్రులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ సీఐ దర్యాప్తు చేపట్టారు. మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. వాడ్ని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు వెల్లడించాడు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.
ALSO READ: షాకింగ్ ఘటన.. చంపినా వారితోనే ఉంటాం, భార్య మాటలపై భర్త ఆగ్రహం
రూ.22 కోసం హత్య
సంక్రాంతి పండుగ రోజున చేగుంట మండలం అనంతసాగర్ వద్ద హత్యకు గురైన మహ్మద్ సిరాజ్(30)
మహ్మద్ సిరాజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
అదే రాష్ట్రానికి చెందిన మహేశ్ కుమార్ వర్మ అనే వ్యక్తితో ఒకే గదిలో ఉంటున్న సిరాజ్
పండుగ రోజు మద్యం సేవిస్తున్న సమయంలో తన పాత బాకీ… pic.twitter.com/piGEbZUxCW
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026