ఇక తాజాగా నిజమాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. కారు డిక్కీలో లభ్యం అయిన శవం.. ముబారక్ నగర్‌కు చెందిన 45 ఏళ్ల కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కక్ష పెంచుకున్నాడు.
కమలకు ఫోన్ చేసి మాధవనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకుకోవడంతో.. అదే రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటిపత్రి, రాళ్లను కప్పి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అద్దెకు కారు తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడి నుంచి అతివేగంతో ఆర్మూర్ వైపు వెళ్తుండగా మాక్లూరు ఠాణా పోలీసులు అనుమానించారు.
డిక్కీలోని తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో కారును వెంబడించారు. దాస్‌నగర్ సమీపంలోని కాలువ వద్ద కారుని ఆపి తనిఖీ చేయగా.. డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు.
Also Read: నీళ్ల బకెట్‌లో ముంచి.. పసికందును చంపేసిన తల్లి, ఆపై కొత్త డ్రామా
మరోవైపు ఈ కేసుపై మృతురాలి బంధువులు సంచలన ఆరోపణ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు కమల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అంటూ ఆరోపించారు. హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.