Kurnool Bus Fire Accident: ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి చెందారని, పది మంది గాయాలతో బయటపడ్డారన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
మృతుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహబూబ్ నగర్ లో 2013లో పాలెం వద్ద జరిగిన దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకునేలా, రవాణా శాఖ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
1.మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం.రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా-గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
2.బడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
3.అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
4.సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు, బెంగళూరు – గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
5.నెలకుర్తి రమేష్ (36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, సురక్షితంగా ఉన్నారు.
6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.
7.కపర్ అశోక్ (27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.
8.ముసలూరి శ్రీహర్ష (25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
9.పునుపట్టి కీర్తి (28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.
10.వేణుగోపాల్ రెడ్డి (24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.
11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తై హైదరాబాద్ చేరుకున్నారు.
12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
13.అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.
14.ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.
16.పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
17.గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
18.శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
20.చారిత్ ( 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
21.మొహమ్మద్ ఖిజర్ (51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
22.తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే టికెట్ రద్దు చేసుకున్నారు.
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్, ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత ఘటనస్థలం నుంచి పరారయ్యాడు.
2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రయాణికుల జాబితా.. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు కాల్ చేయండి
మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.