AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ చివరికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకుల్లో ఒకటి తొలగింది. ఇక చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై నివేదికలు రెడీ చేయాలని పార్టీ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మరోవైపు వైసీపీకి అసలు సవాల్ ఓటర్ల జాబితా. SIRలో దాదాపు 44 లక్షల పేర్లు తొలగించే ప్రక్రియపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తుది జాబితా వచ్చే వరకు ఎన్నికలు వద్దంటోంది. అంటే.. ఇది కేవలం స్థానిక నాయకుల ఎన్నిక కాదు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల పాలనపై ప్రజల మూడ్ ఎలా ఉందో చెప్పే పరీక్ష. వైసీపీకి అసెంబ్లీ ఓటమి తర్వాత గ్రౌండ్ లెవెల్ లో తిరిగి పట్టు సాధించే ఛాన్స్ ఉంది. మరి పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఎవరి జెండా ఎగురుతుంది..?