Hyderabad News: షాపింగ్ ఓపెనింగ్ అని చెప్పి ఫ్రెండ్ ద్వారా కబురు పెట్టారు. నిజమేనని నమ్మేసింది ఆ నటి. చివరకు రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ నటి గదిలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత మాట్లాడారు.. ఆపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ససేమిరా అనడంతో నటిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
హైదరాబాద్ సిటీలో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 30 ఏళ్ల బాలీవుడ్ టీవీ నటి ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఓ ఫోన్ కాల్ వెళ్లింది. తన స్నేహితురాలు ఫోన్ చేసి షాప్ ఓపెనింగ్‌కు వస్తావా అని రిక్వెస్ట్ చేయడంతో నగరానికి వచ్చింది.
కార్యక్రమంలో పాల్గొన్నందుకు రాను పోను విమాన ఛార్జీలు, షాపు ఓపెనింగ్‌కు కొంత నగదు చెల్లిస్తారని చెప్పింది. సరేనని చెప్పిన ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చింది ఆ నటి. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలోని శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసింది. నటికి ఓ వృద్ధురాలు కావాల్సిన వసతి ఏర్పాటు చేసింది.
శుక్రవారం రాత్రి 9 నుంచి
మార్చి 21న రాత్రి 9 గంటల సమయంలో నటి ఉన్న అపార్ట్‌మెంట్‌కి ఇద్దరు మహిళలు వెళ్లారు. తమతో కలిసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఇరువురు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. 9 గంటలకు గొడవ జరగ్గా.. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు వ్యక్తులు నటి ఉన్న గది వద్దకు వచ్చారు.
ALSO READ: ఎంఎంటీసీ రైలులో అనంత యువతిపై అత్యాచార యత్నం
తమతో గడపాలని ఆ నటిని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె ఎదురు తిరిగింది. ఆపై వచ్చిన ముగ్గురు ఆమెపై దాడి చేశారు. బాధితురాలు గట్టిగా అరవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలు, ఇద్దరు మహిళలు, నటిని ముగుర్ని గదిలో బంధించి రూ.50 వేల నగదు పట్టుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
లోతుగా విచారణ
చివరకు బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాసబ్‌ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తులెవరు? రాత్రివేళ ఎందుకు వచ్చారు? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు?