BigTV English

Lucky Plants: ఈ మొక్కలు మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి.. వెంటనే తెచ్చేసుకోండి

Lucky Plants: ఈ మొక్కలు మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి.. వెంటనే తెచ్చేసుకోండి

వాస్తు శాస్త్రంలో చెట్లకు, మొక్కలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పర్యావరణాన్ని, పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఇంట్లోకి మంచి గాలిని ప్రసరించేలా చేస్తాయి. అలాగే సానుకూల శక్తిని కూడా తెస్తాయి. కొన్ని మొక్కలను సరైన దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి, అదృష్టం కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఎలాంటి చెట్లు లేదా మొక్కలు ఉండాలో తెలుసుకోండి.


మీ జీవితంలో సానుకూల శక్తి ఎదగాలంటే వాస్తు శాస్త్రం చెప్పిన ప్రకారం కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ఎలాంటి మొక్కలని ఇంట్లో పెట్టుకోవాలో చెబుతుంది. వీలైనంతవరకు వీటిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీకు అంతా మేలే జరుగుతుంది.

మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ కు వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మీ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇల్లు మొత్తం సానుకూల శక్తి ప్రసరిస్తుంది.


తులసి మొక్క
తులసిని హిందూమతంలో దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవికి మరో రూపమే తులసి మొక్క అని చెప్పుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి. దీన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, సానుకూలత కలుగుతాయి.

దూబ్ గడ్డి
వాస్తు శాస్త్రంలో ధూబ్ గడ్డిని సంపదకు చిహ్నంగా చెప్పుకుంటారు. మీ ఇంటి ప్రాంగణంలో దూబ్ గడ్డిని పెంచేందుకు ప్రయత్నించండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే సంపద కలిగేలా చేస్తుంది. ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది.

కనేర్ మొక్క
కనేర్ మొక్క అనేది లక్ష్మీదేవికి సంబంధించినది. దీని నుంచి వచ్చే పూలు సువాసనను కలిగిస్తాయి. ఆ సువాసన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది. కాబట్టి కనేర్ మొక్కను ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకొని ఇంట్లో పెంచుకునేందుకు ప్రయత్నించండి. కనేర్ మొక్కను ఒక్కోచోట ఒక్కోలా పిలుస్తారు.

జెడ్
ఫెంగ్ షూయ్ లో జేడ్ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది సంపదకు చిహంగా భావిస్తారు. మీ ఇంట్లో జేడ్ మొక్క ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. చైనాలో కూడా జేడ్ మొక్కను చాలా పవిత్రంగా చూస్తారు. దీనిని పెంచేందుకు పెద్ద కుండీలు అవసరం లేదు. చిన్న కుండల్లో కూడా పెరుగుతాయి.

Also Read: అక్కడి ప్రజలకు దుస్తులు అంటే అలర్జీ.. విప్పుకుని తిరిగితేనే ఎనర్జీ అట!

ఈ మొక్కలను తెచ్చుకోవడమే కాదు సరైన దిశలో నాటాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రతిరోజు నీళ్లు పోస్తూ వాటిని కాపాడుకోవాలి. ఎండిపోయేలా చేయకూడదు. పైన చెప్పిన మొక్కలతో పాటు వేప మొక్క, అశోక చెట్టు, అరటి మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ముళ్ళు ఉండే మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ముళ్ళు ఉండే మొక్కలు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. మీ జీవితంలో అదృష్టం, శ్రేయస్సు ఉండాలి. అంటే పైన చెప్పిన అదృష్ట మొక్కలను మాత్రమే తెచ్చుకోండి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×