BigTV English

Son Avenges Father Death: 22 ఏళ్ల తరువాత తండ్రి చావుకి పగతీర్చుకున్న యువకుడు.. అదును చూసి హంతకుడిని ఏం చేశాడంటే..

Son Avenges Father Death: 22 ఏళ్ల తరువాత తండ్రి చావుకి పగతీర్చుకున్న యువకుడు.. అదును చూసి హంతకుడిని ఏం చేశాడంటే..

Son Avenges Father Death| ఒక 50 ఏళ్ల వ్యక్తి ఇటీవల సైకిల్ పై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక లారీ అతడిని ఢీకొట్టింది. ఆ తరువాత ఆ లారీ డ్రైవర్ కిందపడి ఉన్న వ్యక్తి పై నుంచి లారీని ఎక్కించాడు. అలా ఆ వ్యక్తి మరణించాడు. అయితే ఈ ఘటన చూసిన ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు త్వరగా లారీ నెంబర్ తెలుసుకొని విచారణ మొదలు పెట్టారు. కొన్ని గంటల తరువాత ఆ లారీని, లారీ నడిపిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తరువాత పోలీసులక ఈ కేసులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది.


ఆహ్మదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. గోపాల్ అనే 30 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఒక సెకండ్ హ్యాండ్ లారీ కొనుగోలు చేశాడు. ఆ లారీ విలువ రూ.8 లక్షలు కాగా రూ.1.25 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి.. మిగతా బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించాడు. ఆ తరువాత ఆహ్మదాబాద్ నగరంలోని బోడక్ దేవ్ ప్రాంతంలో రెండు రోజులపాటు ఆ లారీ తీసుకొని బాగా తిరిగాడు. ఆ ప్రాంతంలో నఖట్ సింగ్ భాటీ అనే 50 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. గోపాల్ ఈ నఖట్ సింగ్ ని రెండు రోజుల పాటు బాగా గమనించాడు. నఖట్ సింగ్ ఏ సమయంలో డ్యూటీలో ఉంటాడు. ఏ సమయంలో బయటికి వెళతాడు. ఇలా అంతా రెక్కీ చేశాడు. ఆ తరువాత గత మంగళవారం అక్టోబర్ 1, 2024న మధ్యాహ్నం సమయంలో నఖట్ సింగ్ సైకిల్ పై వెళుతుండగా.. గోపాల్ వెనుక తాను కొనుగోలు చేసిన లారీని అతనిపై ఎక్కించాడు. దీంతో నఖట్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు.

Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..


ఆ తరువాత గోపాల్ లారీని స్పీడుగా నడుపుతూ అక్కడి నుంచి తప్పించుకొని పారిపాయాడు. కానీ ఆ ప్రాంతంలో ఇదంతా ఒకరు చూసి పోలీసులకు లారీ నెంబర్ గురించి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు లారీ నెంబర్ ట్రాక్ చేసి గోపాల్ అని అరెస్టు చేసి విచారణ చేశారు. గోపాల్ పూర్తి పేరు గోపాల్ సింగ్ భాటి. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి సమీపంలోని అజాసర్ గ్రామానికి చెందినవాడు. అయితే గోపాల్ ఎందుకు ఈ హత్య చేయడానికి కారణం అతని 22 ఏళ్ల పగ. ఇప్పుడు గోపాల్ వయసు 30. 22 ఏళ్ల క్రితం గోపాల్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు అతని తండ్రి హరిసింగ్ భాటి రైతుగా ఉండేవాడు. ఒక రోజు హరిసింగ్ సైకిల్ పై వెళుతుండగా.. వెనుకనుంచి వచ్చిన ఒక లారీ అతడి పై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో హరి సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా కొంత దూరంలో ఉన్న 8 ఏళ్ల పిల్లాడు గోపాల్ చూశాడు. తన కళ్లెదుటే కన్న తండ్రి హత్య చేయడం చూసిన గోపాల్ మనసులో పగ(Revenge) పెంచుకున్నాడు.

ఆ తరువాత పోలీసులు గోపాల్ తండ్రి హరి సింగ్ హత్య కేసులో నఖట్ సింగ్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నఖట్ సింగ్, హరి సింగ్ మధ్య భూ తగాదాలున్నాయి. ఈ కారణంగా హరి సింగ్ హత్య జరిగింది. ఈ నలుగురికి హరి సింగ్ హత్య కేసులో కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే గోపాల్ తన తండ్రి హంతకులు ఎప్పుడు బయటికి వస్తారా? వారిని చంపుదామా? అని ఎదురు చూశాడు. ఈ క్రమంలో గోపాల్ కు తన తండ్రి హంతకుల గురించి ఆ తరువాత సమాచారం తెలియలేదు. అయితే కొంత కాలం క్రితం గోపాల్ కు నఖట్ సింగ్ గురించి తెలిసింది. నఖట్ సింగ్ ఇప్పుడు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇది తెలుసుకున్న గోపాల్.. వెంటనే అహ్మదాబాద్‌ కు వెళ్లి అక్కడ నఖట్ సింగ్ గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత తన తండ్రిని నఖట్ సింగ్ ఎలా హత్య చేశాడో.. అదే విధానంలో నఖట్ సింగ్ ని హత్య చేశాడు.

Also Read: 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..

ప్రస్తుతం పోలీసులు గోపాల్ సింగ్ పై నఖట్ సింగ్ హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Big Stories

×