BigTV English

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

Good News to People New Ration Cards in Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే అందరికీ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసేలా కసరత్తు చేస్తోంది.


రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినేట్ సమావేశం కానుంది. ఇందులో భాగంగనే కొత్త రేషన్ కార్డు అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు పౌర సరఫరా శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం ధ్యానం బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకాయిలు రూ. రూ.1674.40 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. తొలత రూ.1000 కోట్లు విడుదల చేయగా.. తర్వాత రూ.674కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో విడుదల చేసింది.


Also Read:  ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

కొత్త రేషన్ కార్డుతో పాటు కుటుంబాల విభజన, కుటుంబ సభ్యులను చేర్చడం, కుటుంబ సభ్యుల తొలగింపు, అడ్రస్ విషయంలో మార్పులు, చేర్పులు, పాత కార్డులను సరెండర్ చేయడం వంటి విషయాలపై కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, వాహనాల ద్వారా రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో వాహనాల్లో రేషన్ సరుకుల పంపిణీపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోనని డీలర్లు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు 6వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు మరో కొత్తగా 4వేలకు పైగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం రూ.12వేల కంటే ఎక్కువగా ఉంటే రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులు కాదని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో అంగన్ వాడీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. దీంతో మాకు వస్తున్న జీతాలు చాలా తక్కువని, ఈ జీతాలతో కుటుంబాలకు ఎలా పోషించాలని వాపోతున్నారు. కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, మళ్లీ తమకు కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×