UP Crime News: యూపీలో ఊహించని దారుణం జరిగింది. ప్రియురాల్ని చంపిన ప్రియుడు, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు మైనర్ యువతి. ఇంతకీ ఈ ఘటన వెనుక కారణం ఎవరు? యువతి పేరెంట్స్ వల్ల ఇదంతా జరిగిందా? లేకుండా యువకుడు అలా చేశాడా? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
యూపీలోని ముజప్ఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తుపాకీ తూటాలకు ఓ యువ జంట బలైంది. 22 ఏళ్ల యువకుడు ఓ యవతిని ప్రేమిస్తున్నాడు. యువతి వయస్సు 15 ఏళ్లు. యువకుడి వయస్సు 22 ఏళ్లు. అతడి పేరు ప్రిన్స్ అని ముద్దుగా పిలుస్తుంటారు. వీరి ప్రేమ విషయం యువతి పేరెంట్స్‌కి తెలిసింది. తమ ప్రేమను ఫ్యామిలీలు అడ్డుకుంటాయని భావించాడు యువకుడు.
ఇద్దరు కలిసి ఈనెల 19న ఉన్న ఊరి నుంచి పారిపోయాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాపు చేశాడని అందులో ప్రస్తావించాడు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. సొంతూరు నుంచి పరారైన ఈ జంట బులంద్‌షెహర్‌లోని ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
వారిని పట్టుకునేందుకు పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆ గదిని రౌండప్ చేశారు. అయితే పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన ఆ యువకుడు తన దగ్గరున్న తుపాకీతో బాలికను కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో వీరిద్దరి మృతదేహాలను చూసి షాకయ్యారు పోలీసులు.
ALSO READ: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దర్ని చంపేశాడు
ఈ విషయం తెలియగానే బులంద్‌షహర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆయన స్వయంగా పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆ గది నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకొన్నట్లు బులంద్‌షెహర్ పోలీసులు తెలిపారు. ఈ జంట మరణం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
పరిసరాల్లో జరిగిన భయానక సంఘటనలతో స్థానికులు షాకయ్యారు. మైనర్ బాలిక- ఆమె సహచరుడు అద్దె ఇల్లు ఇచ్చారు. ఆ యువకుడు ఆయుధాన్ని ఎలా సంపాదించాడు అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ దారుణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
యువకుడి మామ ప్రమోద్‌కుమార్ తన మొదటి అంతస్తులో ఓగదిని వీరికి అద్దెకు ఇచ్చాడు. తేనెటీగల పెంపకం కేంద్రంలో కార్మికులుగా పరిచయం చేశాడు. వారికి కొన్నినెలల పాటు వసతి అవసరమని యువకుడు చెప్పినట్టు తెలుస్తోంది. నిరుద్యోగి అయిన ప్రిన్స్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు.
అతడిపై దోపిడీ, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 2023లో ముజఫర్ నగర్‌లో ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన కాల్పులపై కేసు ఉంది. అరెస్టయిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడని చెబుతున్నారు. యువతీ యువకుడు వేర్వేరు కులాలకు చెందినవారు. దీంతో అల్లర్లు జరగకుండా ఉండటానికి బాలిక ఇంటి వెలుపల భద్రతను మోహరించారు.