E-Paper
Advertisement

హైద‌రాబాద్ సిటీలో క‌త్తి పోట్ల క‌ల‌క‌లం.. సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు, రంగంలోకి పోలీసులు

హైద‌రాబాద్ సిటీలో క‌త్తి పోట్ల క‌ల‌క‌లం.. సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు, రంగంలోకి పోలీసులు
Advertisement

Hyderabad Crime: కారణాలు ఏమైనా కావచ్చు.. హైదరాబాద్‌ సిటీలో కత్తి పోట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.  ఉద్యోగం నుంచి తొలగించారన్న చిన్నకారణంతో తోటి ఉద్యోగిపై మరొకరు బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అసలు ఏం జరిగింది?

హైద‌రాబాద్ సిటీలో క‌త్తి పోట్ల క‌ల‌క‌లం

Advertisement

హైద‌రాబాద్ సిటీలో ఎక్కడో దగ్గర క‌త్తులతో దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ తరహా ఘటనలు తగ్గలేదు. తాజాగా హైదరాబాద్ సిటీ పరిధిలోని అత్తాపూర్ ఏరియాలో దారుణం జరిగింది. సులేమాన్ నగర్‌లో ఓ యువకుడిపై మరొక వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు రెహానా అనే వ్యక్తి. అతడిపై మరొక వ్యక్తి కోపంతో రెచ్చిపోయాడు. పట్టరాని కోపంతో బ్లేడుతో సదరు ఉద్యోగిపై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుడు గతంలో అదే ఫర్నీచర్ షాపులో పని చేసేవాడు.

Advertisement

సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు, రంగంలోకి పోలీసులు

ఏం జరిగిందో తెలీదుగానీ ఓనర్.. అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆ ప్లేస్‌లో రెహానాను నియమించాడు. దీంతో సదరు వ్యక్తిపై రివేంజ్ పెంచుకున్నాడు. తన ఉద్యోగం పోవడానికి ఆ వ్యక్తి కారణమని భావించాడు.. ఎలాగైనా దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

షాపులో కాస్త నిద్రకు రిలాక్స్ అవుతున్న సమయంలో రెహానాపై నిందితుడు తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. రెహానా మెడ, శరీర భాగాలపై గాయాలు అయ్యాయి. ఈలోగా రెహానా గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారారయ్యాడు. ఇరుగుపొరుగువారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 15 మంది దుర్మరణం

రక్తస్రావంతో ఉన్న రెహానాను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స తీసుకుంటున్నాడు బాధితుడు. షాపులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×