Test Tube Baby Center Scam: తెలుగు రాష్ట్రాల్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్‌లోని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదు చేశారు. అయితే 9 ఏళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సీజ్ చేశారు అధికారులు. అయితే అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
చాలా పెద్ద నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తింపు
ఇక తనిఖీలు విశాఖలో కూడా కొనసాగాయి. ఇప్పటికే ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఓ మహిళకు భర్త వీర్య కణాలతో కాకుండా మరో వ్యక్తి వీర్య కణాలతో సంతానం కలిగించారు. దీంతో బాధిత దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వేరేవారి వీర్యంతో సంతానం కలిగిస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలుడు ఎదుగుతున్నా కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడంతో టెస్టులు చేయించారు. టెస్టుల్లో బాలుడికి క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాకయ్యారు. రెండేళ్ల బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానంతో డీఎన్‌ఏ టెస్టులు చేయించారు. దీంతో శిశువు డీఎన్ఏ వేరే వారిదిగా తేలడంతో దంపతులు షాక్ అయ్యారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై రెండ్రోజుల క్రితం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేపోలీసుల అదుపులో టెస్ట్ ట్యూబ్ సెంటర్ యజమాని డా.నమత్ర…
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో తనిఖీలు చేశారు. సెంటర్‌లో పెద్ద మొత్తంలో వీర్యం శాంపిల్స్ గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి వీర్యం సేకరిస్తున్నట్టు తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ యజమాని నమ్రతను.. నార్త్ జోన్ పోలీసులు విజయవాడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్‌లో కూడా పోలీసుల తనిఖీలు చేశారు. వారికి అనుమానం రావడంతో.. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మహిళ మేనేజర్‌ను అదుపుకి తీసుకున్నారు పోలీసులు.
Also Read: అమెరికాలో రెచ్చిపోయిన అగంతకుడు.. 11 మందిపై కత్తితో దాడి చేసి..
పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించిన పోలీసులు
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో రెవెన్యూ, వైద్య శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్. చాలా పెద్ద నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందన్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించామన్నారు ఆమె.