Snake viral news: ఒక చిన్నారి ఆటలో భాగంగా చేసిన పని, పెద్దవాళ్లు చూసి కూడా నమ్మలేని స్థితికి చేరింది. సాధారణంగా మనం పామును చూసి వణికిపోతాం. కానీ ఒక బాబు చేసిన పని అందరినీ షాక్‌లోకి నెట్టింది. ఆటబొమ్మ అనుకున్నది అసలు పాము అని తేలింది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుంటే.. ఔరా అనేస్తారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? జరిగిన విచిత్రం ఏమిటో తప్పక తెలుసుకోండి.
బీహార్‌లోని బెట్టియాహ్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఏడాది వయసు గల ఒక చిన్నారి తన ఆటలో భాగంగా తాచు పామును ఆటబొమ్మగా భావించి నోటితో కొరికాడు. ఆశ్చర్యకరంగా, ఆ పాము అక్కడికక్కడే చనిపోయింది కానీ చిన్నారి మాత్రం బతికిపోయాడు. ఇది తెలిసి అక్కడి ప్రజలు షాక్ కు గురయ్యారు, అలాగే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఎలా జరిగింది ఈ విచిత్ర సంఘటన?
బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో చిన్నారి గోవింద తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఆ సమయానికి సుమారు 2 అడుగుల పొడవున్న ఒక తాచు పాము ఇంట్లోకి వచ్చింది. దానిని ఆటబొమ్మగా భావించిన బాలుడు దానిని చేత్తో పట్టుకుని నోటితో కొరికేశాడు. నొప్పి తట్టుకోలేక ఆ పాము చనిపోయింది.
చిన్నారి క్షేమంగా ఉన్నాడా?
చిన్నారి కాసేపట్లోనే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని మజౌలియా వైద్యశాలకు తీసుకెళ్లారు. మొదటి చికిత్స అనంతరం బెట్టియాహ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు. బాబు ఆరోగ్య స్థితిపై హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దేవికాంత్ మిశ్రా మాట్లాడుతూ.. చిన్నారికి విషం ప్రభావం కనిపించలేదు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది, అతడు పూర్తిగా ప్రమాదం నుండి బయటపడ్డాడని తెలిపారు.
Also Read: Metro Project Cancellation: ఆ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్.. షాక్ లో మాజీ సీఎం!
గ్రామస్థుల మాట ఇదే!
గ్రామంలోని పెద్దలు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు స్థానికులు మాట్లాడుతూ, పాము చిన్నారికి దగ్గరగా వచ్చి ఉండవచ్చు. బాబు భయపడి దానిని ఆటలో భాగంగా కొరికేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ఘటనలో అసలు విషయం ఏమిటంటే.. చిన్నారి పళ్ళతో పామును రెండుగా చీల్చడమే. చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
ఈ సీజన్‌లో అధిక వర్షాల వల్ల పాములు తమ ఆవాసాల నుండి బయటకు రావడం ఎక్కువైందని పాముల సంరక్షకులు చెబుతున్నారు. ఇటీవల గురుగ్రామ్ లో జూలై నెలలోనే 85 పాములను రక్షించారని అధికారులు తెలిపారు. చివరగా ఏడాది వయసు ఉన్న బాబు ఒక పామును కొరికి చంపడం అనేది ఊహించని సంఘటనగానే మారింది. ఏదిఏమైనా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అసలే వానా కాలం.. తస్మాత్ జాగ్రత్త.. గృహాలలోకి పాములు వచ్చేస్తున్నాయ్!