E-Paper
Advertisement

పోలీసులకే సవాల్.. అందరూ చూస్తుండగానే బ్యాంకును ఊడ్చేశారు!

పోలీసులకే సవాల్.. అందరూ చూస్తుండగానే బ్యాంకును ఊడ్చేశారు!
Advertisement

Bank Robbery: గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో పట్టపగలే ఓ భారీ బ్యాంకు దోపిడీ చోటుచేసుకుంది. వరాచా ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ లక్ష్యంగా దుండగులు అత్యంత పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న సమయంలోనే లోపలికి ప్రవేశించిన దుండగులు, మొదట అక్కడి అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దీనివల్ల బయటి ప్రపంచానికి లేదా పోలీసులకు సమాచారం అందకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం తుపాకులతో బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి భయాందోళనలకు గురిచేశారు. ఎవరూ ఫోన్ కాల్స్ చేయకుండా ఉండేందుకు అందరి మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు.

Advertisement

తుపాకుల నీడలో సిబ్బందిని లొంగదీసుకున్న దొండగులు, సుమారు రూ.50 లక్షల పైగా నగదును దోచుకొని అక్కడి నుండి పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే వరాచా వంటి ప్రాంతంలో, అందరూ చూస్తుండగానే ఇంతటి సాహసోపేతమైన దోపిడీ జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్‌షాప్‌ దగ్ధం

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×