E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. తెర వెనుక కొత్త కోణం

Hyderabad Crime: హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. తెర వెనుక కొత్త కోణం
Advertisement

Hyderabad Crime: కారణాలు ఏమైనా కావచ్చు.. కాకపోతే ఓ టెక్కీ చున్నీతో ఉరేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ ఏరియాలో వెలుగుచూసింది. మృతుడు సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందినవాడు. ఈ విషయం తెలిసి అతడి కుటుంబసభ్యులు షాకయ్యారు. ఆత్మహత్య వెనుక అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా తిల్లకుప్ప గ్రామానికి చెందినవాడు ఉండ్రు సతీష్‌. అతడి వయస్సు 31 ఏళ్లు. హైదరాబాద్ సిటీలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సతీష్‌కు ఏడాది కిందట రవళి అనే యువతితో వివాహం జరిగింది. దంపతులు గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మియాపూర్‌ బీకే ఎన్‌క్లేవ్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లింది సతీష్ భార్య రవళి. పని కారణంగా సతీష్ హైదరాబాద్‌లో ఉండిపోయాడు. సతీష్‌‌కు తోడుగా అతడి తమ్ముడు వెంకటకృష్ణ ఉండిపోయాడు. బుధవారం ఉదయం సతీష్‌ బెడ్‌‌రూమ్‌ నుంచి బయటకు రాలేదు. తమ్ముడు ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఇంటికి రప్పించాడు. స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు.

Advertisement

సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి వెనుక కొత్త కోణం

భార్య చున్నీతో సతీష్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అది చూసి షాకయ్యాడు వెంకటకృష్ణ. కిందకు దించి హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం తెలిసి సతీష్ భార్య, తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ విషయం తెలియగానే కన్నీరుమున్నీరు అయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం సతీష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పని ఒత్తిడి తట్టుకోలేక సతీష్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు అంచనాకు వచ్చారు. ఆఫీసులో గంటల తరబడి పని చేసేవాడని, రూమ్‌కి పనిలో నిమగ్నమయ్యేవాడని అంటున్నారు అతడి ఫ్రెండ్స్. అన్నేసి పని గంటలు పని చేయడంతో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది.

ALSO READ: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన గర్ల్స్ హాస్టల్

పని ఒత్తిడి గురించి మరోసారి సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. పని గంటల విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టెక్కీ మృతితో దీనిపై మరోసారి చర్చ జోరందుకుంది. నార్మల్‌గా ఐటీ కంపెనీల్లో 8 నుంచి 12 గంటలు పని చేస్తుంటారని చెబుతున్నారు. ఆ లెక్కన చూసినా వారానికి 60 గంటలు అవుతోంది. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మానసిక నిపుణులు చెబుతున్న మాట.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×